Main Menu

కామినేనిపై క‌త్తిలాంటి సెటైర్

Spread the love

క‌త్తి మ‌హేష్..ఘాటు ట్వీట్ల‌తో హ‌ల్ చ‌ల్ చేయ‌డం అల‌వాటుగా మార్చుకున్న క్రిటిక్. తాజాగా ఆయ‌న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పై దృష్టిపెట్టారు. తాజాగా రాజీనామా చేసిన కామినేని వ్య‌వ‌హారాల‌పై క‌త్తిలాంటి కామెంట్ చేశారు. దాంతో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో అది వైర‌ల్ గా మారుతోంది. ప్ర‌త్యేక హోదా కోసం ఢిల్లీ కూడా వెళ్లి, వైసీపీ నేత‌ల‌తో క‌లిసి ధ‌ర్నా నిర్వ‌హించిన క‌త్తి మ‌హేష్ సెటైర్ హాట్ టాపిక్ అవ‌తోంది. ‘‘శ్రీ కామినేని గారి రాజీనామాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పసికందులు మరణించిన వైభవ శకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగంలో ముగిసిందని భావిస్తున్నాను. చంద్రబాబు గారికి అభినందనలు’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. దాంతో ఇది చాలామందిని ఆక‌ట్టుకుంటోంది.

దానికి ముందు టాలీవుడ్ హీరోల‌త మీద ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్ర‌త్యేక హోదాపై స్పందించ‌ని హీరోల‌ను త‌ప్పుబ‌ట్టారు. సంపూర్ణేష్ బాబు, నిఖిల్, శివాజీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్ర‌మే హీరోలంటూ ట్వీట్ చేశారు. . ‘‘సంపూర్ణేష్ బాబు, నిఖిల్ నిజమైన హీరోలు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకూ స్పందించిన శివాజీ, పవన్ కల్యాణ్ మినహా మిగతా ఏ హీరో కూడా నిజ జీవితంలో ప్రజల కోసం కనీసం మాట, ఒక ట్వీట్, ఒక ఉద్యమ అడుగు వెయ్యలేదు. కాబట్టి ప్రస్తుతానికి నా దృష్టిలో ఈ నలుగురే హీరోలు’’ అంటూ వ్యాఖ్యానించారు.






Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the loveఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *