Main Menu

చంద్రబాబు మీద కత్తి

mahesh kathi
Spread the love

ప్రముఖ విశ్లేషకుడు కత్తి మహేష్ ద్రుష్టి ఇప్పుడు ఏపీ సర్కారు తీరు మీద పడింది. ఇప్పటికే జనసేన అభిమానులతో నిత్యం కయ్యానికి దిగుతున్న ఆయన తాజాగా చంద్రబాబు సర్కారు వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా పవన్ కల్యాణ్ ప్రకటించిన తన పార్టీ ఆశయాలను కూడా కత్తి మహేష్ ఎద్దేవా చేశారు. పిల్లలు పాఠశాలలో చేసే ప్రతిజ్ణలా ఉందంటూ సెటైర్ విసిరారు. టీడీపీ తో కలిసి కులరహిత సమాజం సాధిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.

ఇక అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కత్తి మహేష్ తీవ్రంగా నిరసించారు. దేవాదాయ శాఖ పరిధిలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ పేరిట విడుదలైన ఆదేశాలను ప్రశ్నించాడు. జనవరి 1న దేవాలయాలకు అలంకరణలు వద్దని, నూతన సంవత్సరం ఉగాది నాడు ప్రారంభమవుతుందని, క్రీస్తు శకాన్ని అనుసరించి జనవరి 1న పండుగ చేసుకోవడం సముచితం కాదని, ఆలయాల్లో పండగ వాతావరణం సృష్టించొద్దని కమిషనర్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.

ఏపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై మహేశ్‌ కత్తి తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ఆయన స్పందించారు. ‘చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనం పట్టింది. రాజధాని మాత్రం అంతర్జాతీయం కావాలి. కొత్త సంవత్సరం మాత్రం జనవరిలో వద్దు. మూర్ఖత్వానికి పరాకాష్ట. హిందుత్వ రాజకీయాలకు తెరతీత. సిగ్గుసిగ్గు !’ అని మహేశ్‌ కత్తి పోస్టు చేశారు. దాంతో ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరు మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో కత్తి కామెంట్స్ చర్చనీయాంశాలవుతున్నాయి.






Related News

Hyderabad: TDP President N Chandrababu Naidu's son Nara Lokesh is felicitated on the first day of the party's  Mahanadu at Gandipet near Hyderabad on Wednesday. PTI Photo (PTI5_27_2015_000150A)

రాజమండ్రి నుంచి కాకినాడ మారిపోయిన టీడీపీ

Spread the love8Sharesటీడీపీ మారిపోయింది. కాకినాడ‌కు త‌ర‌లించేస్తోంది. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం అనుకున్న‌ప్ప‌టికీ అక్క‌డి ప‌రిస్థితులు అనుకూలంగా లేవ‌ని భావిస్తోంది. కాకినాడ‌లో స‌మ‌స్య‌లుRead More

Telugu-image

మారిన రాజ‌కీయం: ఉప ఎన్నిక‌ల‌కు దారితీసేనా?

Spread the love6Sharesఎట్ట‌కేల‌కు లోక్ స‌భ స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించారు. గ‌త నెల చివ‌రిలోనేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *