Main Menu

కత్తి మహేష్ దే పై చేయి

Spread the love

తాజాగా కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వ్యవహారంలో పవర్ స్టార్ పై సినీ క్రిటిక్ పై చేయిగా కనిపిస్తున్నారు. దానికి కారణం ఆయన ప్రస్తావించిన అంశాలకు సమాధానం చెప్పలేకపోవడమే. 6 ప్రశ్నలకు పవన్ శిబిరం నుంచి సమాధానం వస్తే కథ కొత్త మలుపు తిరుగుతుందనడంలో సందేహం లేదు. లేకుంటే మాత్రం ప్రజల్లో పూనమ్ తో పవన్ సంబంధంపై సవాలక్ష అనుమానాలు పెరుగుతాయనే చెప్పవచ్చు. అందుకే వీలయినంత త్వరగా ఈ విషయంలో ఓ కొలిక్కి వచ్చేలా చూసుకోవడం రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ పవన్ కళ్యాణ్ కి అత్యవసరంగా మారింది.

ఒకవేళ కత్తి మహేష్ సంధించిన ప్రశ్నలు అవాస్తవాలయితే పరువు తీసినందుకు తక్షణం కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది. ఇలాంటి నిరాధార వ్యవహారాలకు అడ్డుకట్టే వేసుకోవాల్సి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా మౌనమే సమాధానం అనుకుంటే మాత్రం పవన్ తీరు చివరకు ఫ్యాన్స్ ని కూడా సంత్రుప్తి పరచలేని స్థాయికి చేరుతుందని చెప్పవచ్చు. గతంలో పరిటాల గుండు గురించి దుమారం రేగినప్పుడు మాట్లాడకుండా, ఇప్పుడు దానికి సమాధానం చెప్పుకున్నప్పటికీ పవన్ కి కలిగిన నష్టం పూడ్చలేనిది. ఇప్పుడు పూనమ్ విషయం మరింత పెద్దదే అని చెప్పవచ్చు. ముగ్గురు భార్యలతో నైతికంగా పవన్ కి విలువల్లేవని వాదించే వారికి పూనమ్ మరో ప్రధాన అస్త్రంగా మారబోతోంది.

ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలను బట్టి కత్తి మహేష్ పై చేయి సాధించారనే చెప్పవచ్చు. పవన్ ఫ్యాన్స్ చేస్తున్న చేష్టలు గమనిస్తే తమ హీరోకి మరింత డ్యామేజ్ చేసే పనిలో పూర్తిగా మునిగి ఉన్నట్టు కనిపిస్తోంది. మహేష్ ఫోన్ నెంబర్ షేర్ చేసి అతడిని బెదిరించాలని చూసినా ఈ సమయంలో అతడు వెనక్కి తగ్గే అవకాశం లేదు. పైగా మరింత రెచ్చిపోయే ప్రమాదం స్పష్టంగా ఉందన్నది తాజా పరిణామాలే ఉదాహరణ. అందుకు తోడు కత్తి మహేష్ మీద ఎదురుదాడి కూడా ఉపయోగం ఉండదని ఈ మూడు నాలుగు నెలలుగా అనుభవం ద్వారానైనా జనసేన తెలుసుకోవాలి. సమస్య పరిష్కరించుకోకుండా మరింత పెంచడానికి ప్రయత్నిస్తే చివరకు పోయేది పవన్ పరువు అన్నది అర్థమయితే విరుగుడు కనిపెడతారు. దానికి భిన్నంగా కత్తి మహేష్ నోరు నొక్కాలని ప్రయత్నిస్తే మాత్రం అది అసాధ్యంగా కనిపిస్తోంది.


Related News

పురందేశ్వ‌రి పోటీ ఎక్క‌డ‌?

Spread the loveఏపీ రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. సంక్రాంతి త‌ర్వాత మ‌రింత జోరుగా మార్పులు, చేర్పులు ఉంటాయ‌ని చెబుతున్నారు. అందుకుRead More

బుద్ధా వెంక‌న్న వ్యూహాత్మ‌కంగానే వైసీపీలోకి…!

Spread the loveటీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న వ్య‌వ‌హారం ఆది నుంచి చ‌ర్చ‌నీయాంశ‌మే. దుర్గ గుడి వ్య‌వ‌హారాల ఉంచి టీడీపీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *