ప‌వ‌న్ ఫ్యాన్స్ కి దొరికిన క‌త్తి మ‌హేష్

Its-Not-Jana-Sena--Kapu-Sena--Kathi-Mahesh-1512798570-1316
Spread the love

ఫిల్మ్ క్రిటిక్ గా కెరీర్ ప్రారంభించి కొంత కాలంగా పొలిటిక‌ల్ ఎనాలిసిస్ కి సిద్ధ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీసారి జ‌న‌సేన మీద‌, ఆపార్టీ కార్య‌క‌ర్త‌ల మీద విరుచుకుప‌డుతున్నారు. పాయింట్స్ ఆధారంగా బ‌లంగా వాదిస్తూ ప‌లువురి అభిమానం కూడా సంపాదించారు. కానీ అనూహ్యంగా ఆయ‌న ప‌వ‌న్ ఫ్యాన్స్ కి దొరికిపోయారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఓ సంద‌ర్భంగా జోహార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ పేర్కొన‌డంపై వివాదాస్ప‌ద ట్వీట్ చేశారు.

అయితే వాస్త‌వానికి జోహార్ అన‌డంలో ఎటువంటి దోషం లేదు. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఏ ఉద్దేశంతో జోహార్ ప‌వ‌న్ ఫ్యాన్స్ అన్న‌ప్ప‌టికీ “జోహార్ పవన్ కళ్యాణ్” ఏంట్రా నాయనా! అంటూ క‌త్తి ట్వీట్ చేయ‌డం ఆయ‌న అవ‌గాహ‌నా లోపానికి అద్దంప‌డుతోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం నిన‌దిస్తూ ఫ్యాన్స్ కొంద‌రు ఇలాంటి కామెంట్స్ చేయ‌డం విశేషంగా మారింది. వాస్త‌వానికి తెలుగు భాషా నిఘంటువు ప్ర‌కారం జోహార్ అంటే నమస్కారం, ప్రణామం, అంజలి, నమస్సులు, కైమోడుపు లాంటి అర్ధాలు ఉన్నాయి. అంటే పూర్తిగా సానుకూల అర్థ‌మే క‌నిపిస్తోంది. కానీ దానిని నెగిటివ్ గా భావించి క‌త్తి మ‌హేష్ త‌ప్పుబ‌ట్ట‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. కేవ‌లం చనిపోయినవారికి మాత్రమే వాడే పదం అని కొంద‌రు భావించ‌డం భాషా ప‌రిజ్ఞాన‌లోప‌మే త‌ప్ప మ‌రోటి కాదు.

అంతేగాకుండా గ‌తంలోనే జోహారు శిఖిపింఛమౌళి అని సాక్షాత్తూ జ్ఞాన‌పీఠ్ అవార్డ్ గ్ర‌హీత సినారే ఒక పాట కూడా రాశారు. దాని ప్ర‌కారం జోహారు అంటే కేవ‌లం నమస్కారం అనే అర్ధం మాత్రమే వస్తుంది. అయినా క‌త్తి మ‌హేష్ మాత్రం ఓ అడుగు ముందుకేసి ప‌వ‌న్ ఫ్యాన్స్ ని త‌ప్పుబ‌ట్ట‌డం కోసం ప్ర‌య‌త్నంలో తెలుగు భాష‌లో త‌న అవ‌గాహ‌నాలోపాన్ని బ‌య‌ట‌పెట్టుకున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంద‌ని ప‌లువురు భాషా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.


Related News

YSRCP TDP_2900

బాబుకి మరో దెబ్బ: టీడీపీ నుంచి జంపింగ్

Spread the loveటీడీపీ అధినేత చంద్రబాబుకి కాలం కలిసి వస్తున్నట్టు లేదు. ఆయన ఏం చేసినా బూమరాంగ్ అవుతోంది. ఒకప్పుడుRead More

Kanna-Lakshmi-Narayana-Join

వైసీపీ వైపు క‌న్నా క‌న్ను

Spread the loveఏపీ బీజేపీకి మ‌రో సీనియ‌ర్ సెల‌వు చెప్పే యోచ‌న‌లో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి వ్య‌వ‌హారంRead More

 • బీజేపీ మంత్రి భార్య‌కు ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన చంద్ర‌బాబు
 • ఆ మూడు బ‌హిష్క‌రించిన జ‌న‌సేన‌
 • బీజేపీకి ఎమ్మెల్యే గుడ్ బై!
 • గోదారోళ్ల‌కే ప‌ట్టం క‌డుతున్న పార్టీ
 • టీడీపీని కాపాడాలంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌
 • బెజ‌వాడలో వైసీపీ కి కొత్త స‌మ‌స్య‌లా..?
 • అమ‌రావ‌తి అవినీతిపై మ‌రో పుస్త‌కం
 • బాబుకి షాక్…వైసీపీలోకి కీల‌క నేత‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *