Main Menu

కన్నా కమల దళపతి కావడానికి కారణం అదేనా?

Spread the love

గుంటూరు జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన కన్నా లక్ష్మీనారాయణ చివరకు కమల దళానికి సారధి కాగలిగారు. చాలామార్లు కాంగ్రెస్ లో పీసీపీ పీఠం కోసం ప్రయత్నించినా దక్కించుకోలేకపోయిన కన్నా..ఇప్పుడు కమలంలో కిరీటం ధరించగలిగారు. సుడీర్థకాలంగా బీజేపీలో ఉన్న అనేక మంది సీనియర్లు ప్రయత్నించినప్పటికీ, వారందరినీ కాదని కన్నాని బీజేపీ ప్రెసిడెంట్ గా ప్రకటించడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. టీడీపీ నేతలనయితే కొత్త ఆందోళనకు గురిచేస్తోంది. సోము వీర్రాజు వద్దని భావించిన టీడీపీ శిబిరానికి కన్నా రూపంలో కొత్త సమస్య ముందుకొచ్చిందని భావించే పరిస్థితి వచ్చింది.

అయితే సోము వీర్రాజు లాంటి మంచి లాబీయింగ్ ఉన్న నేతను కాదని కన్నాని అధ్యక్షుడిగా ఎంపిక చేయడానికి అనేక కారణాలున్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కావడం, చంద్రబాబుకి సుదీర్ఘకాలంగా వ్యతిరేకంగా ఉండడం, రాజధాని ప్రాంత వాసి కావడం వంటి అనేక అంశాలు తోడయ్యాయి. కానీ అన్నింటికీ మించి కన్నా లక్ష్మీనారాయణ చేజారిపోకుండా చూసుకోవాలని బీజేపీ నిర్ణయం తీసుకోవడం కూడా మరో ప్రధాన కారణంగా చెబుతున్నారు.

తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోతే బీజేపీని వీడిపోతానని కన్నా చెప్పడం, అదే సమయంలో సోము వీర్రాజుకి ఇస్తే తాను పార్టీ నుంచి పోతానని ఆకుల సత్యన్నారాయణ హెచ్చరించడంతో బీజేపీ నేతలకు రెండు ప్రశ్నలకు ఒకే సమాధానం మాదిరిగా కన్నా కనిపించినట్టు భావిస్తున్నారు. చివరకు వైసీపీలో చేరడానికి కన్నా చేసిన ప్రయత్నం ఆఖరి నిమిషంలో అమిత్ షా అడ్డుపుల్ల వేయడం ద్వారా ఆగిందని సాగిన ప్రచారం వాస్తవమేనని పలువురు భావిస్తున్నారు. జగన్ ని కూడా అమిత్ షా ఆదేశించినట్టు కథనాలు వచ్చాయి. అన్నీ కలిసి ఇప్పుడు కన్నా కోరిక ఫలించింది. అదే సమయంలో అన్నింటికీ మించి వైసీపీతో రాయబారాాల విషయంలో కన్నా మంచి నేర్పరిగా ఉపయోగపడతారని బీజేపీ భావించినట్టు కనిపిస్తోంది. సోము వీర్రాజు కన్నా ఒక నాటి వైఎస్ సన్నిహితుడు కన్నా అయితే జగన్ తో నేరుగా వ్యవహారాలు చక్కదిద్దే అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం ఆశించినట్టు చెబుతున్నారు. మొత్తంగా బీజేపీకి కన్నా పెద్ద అస్త్రం అవుతారని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుకి వ్యతిరేకంగా పావులు కదపాలనే యోచనలో ఉన్న కాషాయ దళానికి కన్నా తగిన నాయకుడు కాగలరని చెబుతున్నారు.


Related News

పురందేశ్వ‌రి పోటీ ఎక్క‌డ‌?

Spread the loveఏపీ రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. సంక్రాంతి త‌ర్వాత మ‌రింత జోరుగా మార్పులు, చేర్పులు ఉంటాయ‌ని చెబుతున్నారు. అందుకుRead More

బుద్ధా వెంక‌న్న వ్యూహాత్మ‌కంగానే వైసీపీలోకి…!

Spread the loveటీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న వ్య‌వ‌హారం ఆది నుంచి చ‌ర్చ‌నీయాంశ‌మే. దుర్గ గుడి వ్య‌వ‌హారాల ఉంచి టీడీపీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *