Main Menu

వైసీపీ వైపు క‌న్నా క‌న్ను

Spread the love

ఏపీ బీజేపీకి మ‌రో సీనియ‌ర్ సెల‌వు చెప్పే యోచ‌న‌లో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి వ్య‌వ‌హారం బీజేపీలో పెద్ద చిచ్చు రాజేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే న‌లుగురు ఆశావాహులు క్యూలో ఉన్నారు. అందులో సోము వీర్రాజుకి చాన్సిస్తే తాను పార్టీని వీడిపోతాన‌ని ఇప్ప‌టికే రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌న్నారాయ‌ణ ప్ర‌క‌టించారు. ఇక ఇప్పుడు తాజాగా త‌న‌కు అవ‌కాశం రావ‌డం లేద‌ని కినుక వ‌హించిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ కూడా పార్టీ ఫిరాయించే యోచ‌న‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. బీజేపీలో త‌న‌కు న్యాయం జ‌రిగే అవ‌కాశం లేనందున పార్టీ మార‌డానికి త‌గ్గ‌ట్టుగా ఆయ‌న అనుచ‌రుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. వారి అభిప్రాయాల‌ను అడిగి తెలుసుకున్నారు.

దాంతో బీజేపీ నేత‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. క‌న్నాతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. తొంద‌ర‌ప‌డి ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌ద్ద‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఆయ‌న మాత్రం వైసీపీపై క‌న్నేసిన‌ట్టు ప్ర‌చారం మొద‌ల‌య్యింది. అనుచ‌రులంతా వైసీపీ ఉత్త‌మం అని సూచించ‌డంతో క‌న్నా కూడా జ‌గ‌న్ గూటికి చేర‌డానికి పెద్దగా స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి క‌న్నా చాలాకాలంగా వైసీపీ శిబిరంతో ట‌చ్ లో ఉన్నారు. బొత్సా వంటి ప‌లువురు సీనియ‌ర్ల‌తో ఆయ‌న‌కు చాలాకాలంగా స‌న్నిహిత సంబంధాలున్నాయి. అదే స‌మ‌యంలో త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబుకి వ్య‌తిరేకంగా బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న జ‌గ‌న్ తో చేతులు క‌లిపితే ఉప‌యోగం ఉంటుంద‌నే అంచ‌నాకి వ‌చ్చేసిన‌ట్టు భావించ‌వ‌చ్చు.

సోము వీర్రాజుని ఆర్ఎస్ఎస్ కోటాలో అద్య‌క్ష‌ప‌ద‌వికి ఎంపిక చేయ‌డంతో క‌న్నా, ఆకుల స‌త్యాన్నారాయ‌ణ రూపంలో ఇద్ద‌రు సీనియ‌ర్లు క‌మ‌లం గూటి నుంచి జారిపోవ‌డం ఖాయం అయ్యింది. అయితే క‌న్నాకి వైసీపీలో బెర్త్ ఖాయం అని చెప్ప‌వ‌చ్చు. మ‌రి ఆకుల ఎటు మొగ్గుతారో చూడాలి.






Related News

టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన మునిసిప‌ల్ వ్య‌వ‌హారం

Spread the loveగుంటూరు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు గ‌రం గ‌రం అవుతున్నాయి. మునిసిపల్ రాజ‌కీయాలు పార్టీలో మంట‌లు రేపుతున్నాయి. జిల్లాలోనిRead More

రోజా వాద‌న‌ను అంగీక‌రించిన కోర్ట్

Spread the loveవైసీపీ ఎమ్మెల్యే రోజా ఎట్ట‌కేల‌కు న్యాయ‌స్థానంలో ఊర‌ట సాధించారు. ఆమె న్యాయ పోరాటం ఫ‌లించింది. టీడీపీ ఎమ్మెల్యేపైRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *