చంద్రబాబుపై బీజేపీ నిప్పులు

Kanna-Lakshmi-Narayana-Join
Spread the love

ఏపీలో బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. చంద్రబాబుపై కత్తులు దూస్తున్నారు. ఇప్పటి వరకూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలకు తోడు తాజాగా కన్నా లక్ష్మీనారాయణ తోడయ్యారు. ఏపీలో చంద్రబాుబ సర్కారుకి మాటలెక్కువ…పని తక్కువ అంటూ కామెంట్ చేశారు. ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక విమానాల్లో సర్కారీ వ్యయం ఖర్చు చేస్తూ చంద్రబాబు దేశవిదేశాల్లో షికార్లు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

అనవసర ఖర్చులు పెడుతూ రాష్ట్రాన్ని మరింతగా అప్పుల పాలు చేస్తున్నారని కన్నా కస్సుమన్నారు. రాజధాని కోసం కేంద్రం ఇచ్చిన 2,500 కోట్ల రూపాయలతో ఏమేం నిర్మాణాలు చేశారో చెప్పడం లేదని అడిగారు. ఇచ్చిన సొమ్ముకు లెక్కా-పత్రాలు లేవని, కనీసం డీపిఆర్ కూడా ఇవ్వకుండా నిధులు ఇవ్వమంటే ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం సినిమా డైరెక్టర్లతో డిజైన్లు వేయించడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబుపై కన్నా మండిపడ్డారు.

బీజేపీ నేతలు క్రమంగా చంద్రబాబు మీద నోరు తెరుస్తున్న నేపథ్యంలో టీడీపీ స్పందన చర్చనీయాంశం అవుతోంది.






Related News

jaleelkhan

ఆ ఎమ్మెల్యేకి హ్యాండివ్వబోతున్న చంద్రబాబు

Spread the loveఏపీ రాజధాని రాజకీయాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. అందులోనూ బెజవాడ పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అందుకుRead More

MLA Alla Ramakrishna Reddy (2)

వైసీపీ ఎమ్మెల్యేకి ఏసీబీ నోటీసులు

Spread the loveఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రుష్ణారెడ్డికిRead More

  • కన్నా కమల దళపతి కావడానికి కారణం అదేనా?
  • జనసేనకు కన్నం కొట్టి..వైసీపీ కి?
  • ఆయన్ని మార్చేసిన జగన్
  • మళ్లీ నీరుగారిపోయిన జగన్ ఛాంబర్
  • టీడీపీ బలం మీద దెబ్బకొట్టిన జగన్
  • జనసేనకి లోకేష్ సవాల్
  • బాబుకి మరో దెబ్బ: టీడీపీ నుంచి జంపింగ్
  • వైసీపీ వైపు క‌న్నా క‌న్ను
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *