Main Menu

కామినేని స్కెచ్ తో టీడీపీ నేత‌కు పొగ‌

Spread the love

ఏపీ మంత్రిగా ఆయ‌న దాదాపుగా నియోజ‌క‌వర్గానికి దూరంగా గ‌డిపారు, నాలుగేళ్ల పాటు రాష్ట్ర‌మంతా తిరిగారు. దాంతో కామినేని శ్రీనివాస్ సొంత నియోజ‌క‌వ‌ర్గం కైక‌లూరులో ఆయ‌న ప‌ట్ల కొంత అసంతృప్తి క‌నిపించింది. ముఖ్యంగా అనుచ‌రుల హ‌వాతో సామాన్యులు స‌త‌మతం అయ్యారు. మంత్రి అందుబాటులో లేకపోవ‌డం, సాధార‌ణ స‌మ‌స్య‌ల్లో కూడా కొంద‌రు కామినేని అనుచ‌రులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో కైక‌లూరు వాసులు అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించారు.

ఈ ప‌రిస్థితిని మాజీ మంత్రి గ‌మ‌నించిన‌ట్టే క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల ముంగిట ప‌రిస్థితి చ‌క్క‌దిద్దుకోకపోతే స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని భావిస్తున్న‌ట్టుంగా ఉంది. దాంతో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత గ‌త కొంత కాలంగా నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌యం కేటాయిస్తున్నారు. ప‌లువురితో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. బీజేపీకి ఎలానూ అవ‌కాశం ఉండ‌దు కాబ‌ట్టి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున బ‌రిలో దిగే యోచ‌న‌లో ఉన్న కామినేని ఉన్నారు.

అదే స‌మ‌యంలో కైక‌లూరు టీడీపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే జ‌య‌మంగ‌ళం స‌హా ప‌లువురు కాచుకుని కూర్చున్నారు. ఆశావాహుల సంఖ్య పెద్ద సంఖ్య‌లోనే ఉన్న త‌రుణంలో ముంద‌స్తు చ‌ర్య‌ల‌తో కామినేని క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ప్ర‌ధానంగా జ‌య‌మంగ‌ళం సామాజిక‌వ‌ర్గం మీద దృష్టిపెట్టి ఆ వ‌ర్గం నేత‌ల‌ను మ‌చ్చిక చేసుకునే ప‌నిలో ఉన్నారు. త‌ద్వారా ఎన్నిక‌ల ముందు తాను టీడీపీలో చేరినా చిక్కులు రాకుండా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే జ‌య‌మంగ‌ళం కూడా అదే రీతిలో ముందుకు సాగుతున్న త‌రుణంలో కామినేని ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా లేదా అన్న‌ది ఆస‌క్తిగా మారింది. కైక‌లూరు టీడీపీలో ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారుతోంది. త‌న‌కు పొగ పెట్టేందుకు కామినేని ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న అంచ‌నాలో ఉన్న జ‌య‌మంగ‌ళం దానికి ధీటుగా సొంత వ‌ర్గంతో నిత్యం స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. దాంతో కైక‌లూరు టీడీపీలో కాక రాజుకుంటుంద‌నే చెప్ప‌వ‌చ్చు.






Related News

ఆర్కే ప్ర‌త్య‌ర్థి అత‌డే..!

Spread the loveవ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అన్ని పార్టీలు కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నారు. వ‌చ్చే మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఈసీRead More

జ‌న‌సేనాని..ఓ సారి వెన‌క్కి చూసుకో..!

Spread the loveరాజ‌కీయ మార్పు కోసం అంటూ ముంద‌డుగు వేసిన జ‌న‌సేనానికి అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఏపీలో స‌మీక‌ర‌ణ కోసం ఏరీతినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *