Main Menu

టీడీపీలో రావెల శ్రీకారం!

Spread the love

టీడీపీ నుంచి పలువురు చేజారిపోయే అవ‌కాశం ఉంద‌ని చాలాకాలంగా భావిస్తున్నారు. అయితే అదికార పార్టీ కావ‌డంతో ఆఖ‌రి నిమిషం వ‌ర‌కూ వేచి చూడాల‌ని చాలామంది చూస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే తాజాగా రావెల కిషోర్ బాబు తో ఈ వ్య‌వ‌హారం మొద‌ల‌యిన‌ట్టుగా చెప్ప‌వ‌చ్చ‌న్న‌ది ప‌లువురు ప‌రిశీల‌కుల అబిప్రాయం. టీడీపీకి రాజీనామా చేసిన రావెల జ‌నసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. 2009 ఎన్నిక‌ల్లోనే రావెల కిషోర్ బాబు భార్య తాడికొండ అసెంబ్లీ స్థానం నుంచి ప్ర‌జారాజ్యం త‌రుపున పోటీ చేసి నాటి కాంగ్రెస్ అభ్య‌ర్థి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ చేతిలో మూడో స్థానంతో ఓటమి పాల‌య్యారు. ఆ త‌ర్వాత రావెల త‌న ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి టీడీపీలో చేరారు. ప్ర‌త్తిపాడు నుంచి గెలిచి మంత్రి గా మూడేళ్లు ప‌నిచేశారు.

అయితే సొంత నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌తో ఆయ‌నకు విబేధాలు ఏర్ప‌డ్డాయి. అంతేగాకుండా జెడ్పీ చైర్మ‌న్ కూడా రావెల మీద విమ‌ర్శ‌లు చేశారు. రావెల త‌న‌యుడు కూడా మ‌హిళ‌ల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించి అభాసుపాల‌య్యారు. ఇలాంటి అనేక కార‌ణాల త‌ర్వాత ఆయ‌న మంత్రి ప‌ద‌వికి ఎస‌రొచ్చింది. ఆనాటి నుంచి ఆయ‌న టీడీపీకి దూరంగా జ‌రుగుతూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల మాదిగ దండోరా కార్య‌క్ర‌మంలో చురుగ్గా ప‌నిచేశారు. చివ‌ర‌కు త‌న పార్టీకి, ఎమ్మెల్యే ప‌దివికి రాజీనామాలు స‌మ‌ర్పించి జ‌న‌సేన‌లో చేరుతుండ‌డం విశేషం.

ఇక రావెల త‌ర్వాత మ‌రికొంద‌రు నేత‌లు ఈ జాబితాలో ఉంటార‌ని స‌మాచారం. డిసెంబ‌ర్ నెలాఖ‌రు నాటికి ఈ ప‌రంప‌ర జోరందుకుంటుంద‌ని అంచ‌నాలేస్తున్నారు. గోదావ‌రి జిల్లాలో టీడీపీకి చెందిన కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు జ‌న‌సేన వైపు చూస్తుంటే, ఇత‌ర ప్రాంతాల్లో కొంద‌రు నేత‌లు వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. ఏమ‌యినా టీడీపీ నుంచి వ‌ల‌స‌ల‌కు రావెల శ్రీకారం చుట్ట‌డం విశేషంగా భావించ‌వ‌చ్చు.






Related News

ఆంధ్రాలో కేసీఆర్ ప్ర‌చారం ఆ పార్టీ కోస‌మే!

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పాత్ర‌పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. టీఆర్ఎస్ భారీ మెజార్టీకి చంద్ర‌బాబు కార‌ణ‌మంటూ సోష‌ల్Read More

చంద్ర‌బాబు క‌న్ను ఆరాష్ట్రంపై!

Spread the loveఏపీ సీఎం ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల‌లో టీడీపీ నేతృత్వంలో ఓ బృందం వెళ్లిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *