జనసేనకు కన్నం కొట్టి..వైసీపీ కి?

pawan
Spread the love

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు తిరిగింది. జనసేనకు కొంత సమస్య తప్పేలా కనిపించడం లేదు. ఏదో మేరకు పవన్ కళ్యాణ్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే దాని మూలంగా వైసీపీకి ప్రయోజనం దక్కుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ వ్యవహారాలను కాపులకు కేటాయించారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్ష పదవిని కన్నా లక్ష్మీనారాయణకు, ఎన్నికల బాధ్యతను సోము వీర్రాజుకి బీజేపీ అప్పగించింది. తద్వారా కాపు వర్గం ఓట్లకు గేలం వేయవచ్చని భావిస్తోంది. తద్వారా కాపుల ఓట్లు జనసేన వైపు మళ్లుతాయని ఆశిస్తున్న వారికి ఆశాభంగం తప్పేలా లేదు. దాంతో కాపుల ఓట్లలో చీలిక వస్తే జనసేన ఆశలకు గండిపడుతుంది.

ఆ మేరకు వైసీపీ లాభపడుతుంది. ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో కాపు ఓట్లను జనసేనాని కారణంగా టీడీపీ దక్కించుకుంది. ఎన్నికల్లో ప్రయోజనం పొందింది. కానీ ప్రస్తుతం కాపు సామాజికవర్గ ఓట్లు జనసేనకు మళ్లితే కొంత ప్రభావం చూపగలుగుతుంది. కానీ తాజాగా బీజేపీలో కాపులకు మంచి స్థానం దక్కుతున్న నేపథ్యంలో కాపు ఓట్లు చీలిక ద్వారా జనసేనకు కొంత నష్టం వాటిల్లుతుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో కాపుల ఓట్లు చీలిక మూలంగా టీడీపీ, జనసేన నష్టపోగా వైసీపీ పరోక్షంగా ఏదో మేరకు లబ్ధి దక్కించుకుంటుందని పరిశీలకుల అంచనా.

బీజేపీ అధిష్టానం నిర్ణయం వెనుక కూడా అదే ప్రధాన కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు. జనసేనకు కన్నం పడితే జగన్ ప్రయోజనం దక్కించుకునే వ్యవహారం ఆచరణలో కనిపిస్తే కన్నా లక్ష్మీనారాయణ నేరుగా కండువా కప్పుకోవడం కన్నా, కాషాయ జెండా ద్వారానే జగన్ కి ఎక్కువ మేలు చేసినట్టవుతుందేమో..






Related News

jaleelkhan

ఆ ఎమ్మెల్యేకి హ్యాండివ్వబోతున్న చంద్రబాబు

Spread the loveఏపీ రాజధాని రాజకీయాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. అందులోనూ బెజవాడ పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అందుకుRead More

MLA Alla Ramakrishna Reddy (2)

వైసీపీ ఎమ్మెల్యేకి ఏసీబీ నోటీసులు

Spread the loveఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రుష్ణారెడ్డికిRead More

  • కన్నా కమల దళపతి కావడానికి కారణం అదేనా?
  • జనసేనకు కన్నం కొట్టి..వైసీపీ కి?
  • ఆయన్ని మార్చేసిన జగన్
  • మళ్లీ నీరుగారిపోయిన జగన్ ఛాంబర్
  • టీడీపీ బలం మీద దెబ్బకొట్టిన జగన్
  • జనసేనకి లోకేష్ సవాల్
  • బాబుకి మరో దెబ్బ: టీడీపీ నుంచి జంపింగ్
  • వైసీపీ వైపు క‌న్నా క‌న్ను
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *