Main Menu

జెండాపీకేసిన జనసేన

Spread the love

జనసేనకు చుక్కెదురయ్యింది. అనూహ్యంగా వెనుదిరగాల్సి వచ్చింది. చివరకు జెండా పీకేయాల్సి వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ పార్టీకి ఎదురుదెబ్బగానే భావింవచ్చు. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా వేసిన తప్పటడుగులు చివరకు తలవంపులు తెచ్చినట్టు అంతా భావిస్తున్నారు. ఆర్భాటంగా కార్యక్రమం నిర్వహించడమే తప్ప, దాని వెనుక అసలు ప్రమాదం గుర్తించకపోవడంతో ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నప్పటికీ పోయిన పరువు తిరిగిరాదని పలువురు వాపోతున్నారు.

సినిమాకు గుడ్ బై చెప్పేసి ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా పవన్ రూపాంతరం చెందారు. కానీ రాజకీయ ఎత్తుల్లో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించలేక ఇటీవల ఉన్న ఇమేజ్ ని కోల్పోయే ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన పవన్ ఇప్పుడు ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి రావడం జనసేనకు ఇబ్బందికరంగా మారింది. చివరకు పార్టీ శ్రేణులు వెళ్లి చినకాకాని ప్రాంతంలో 181/182వ సర్వే నెంబర్ లోని 3ఎకరాల స్థలంలో పవన్ వచ్చి పాతిన జెండాలు పీకేయడం విశేషంగా మారింది. పార్టీకి కేంద్ర స్థానం కోసం అధినేత వేసిన తొలి అడుగే పెద్ద తప్పిదంగా మారిపోయి, చివరకు అక్కడి మెటీరియల్ అంతా సర్థుకుని వెనక్కి రావాల్సి రావడం విమర్శకులకు మంచి అవకాశంగా మారుతోంది.

వాస్తవానికి ఆ స్థలంలో వివాదంలో ఉందని ముస్లీం ఐక్యవేదిక మీడియా ముందుకు రాగానే పవన్ జాగ్రత్తలు పడాల్సి ఉంది. ముందుగా సమస్య గుర్తించకపోయినప్పటికీ ఆందోళన వ్యక్తం చేసిన వారితో చర్చించి సమస్య పరిష్కరించుకుని ఉంటే తగాదా ఉండేది కాదు. కానీ హైకోర్ట్ లో జలీల్ కి అనుకూలంగా తీర్పు వచ్చిన ప్రాంతంలో పార్టీ కార్యాలయం నిర్మాణానికి పూనుకుని, ఆటంకాలు వచ్చినప్పటికీ యధాలాపంగా వదిలేయడంతో చివరికిప్పుడు జెండాలు పీకేయాల్సిన దుస్థితి దాపురించింది. ఇది జనసేన నాయకత్వ వైఫల్యంగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. సమస్య వచ్చిన వెంటనే సర్థుబాటు చేసుకోవడానికి తగ్గట్టుగా ఆపార్టీ కేంద్ర నాయకత్వం కదలలేదని ఈ పరిణామాలు చెబుతున్నాయి. దాంతో జనసేన వ్యూహాకర్తల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఓ కొత్త పార్టీకి ఇలాంటి పరిణామాలు శుభసూచికం కాదని మాత్రం చెప్పవచ్చు. అదే సమయంలో మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబుకి అన్ని రకాలుగా వంతపాడుతున్నప్పటికీ ఈ విషయంలో జనసేనానికి ఏమాత్రం సహకరించలేదనే అభిప్రాయం బలపడుతోంది.


Related News

అమ‌రావ‌తి వైసీపీలో ఆస‌క్తిక‌ర మలుపు

Spread the love3Sharesవిప‌క్ష వైసీపీలో వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా రాజ‌ధాని జిల్లాకు చెందిన ప‌రిణామాలు చ‌ర్చ‌నీయాంశాల‌వుతున్నాయి. ఇప్ప‌టికే గుంటూరుRead More

ఆర్కే ప్ర‌త్య‌ర్థి అత‌డే..!

Spread the love19Sharesవ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అన్ని పార్టీలు కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నారు. వ‌చ్చే మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఈసీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *