Main Menu

జనసేన చుట్టూ జగడం

Spread the love

అనూహ్య పరిణామం ముందుకొచ్చింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. అది కూడా స్థలం సమస్య కావడం చర్చనీయాంశం అవుతోంది. ఏకంగా జనసేన అధినేత వారం క్రితం పరిశీలించిన వచ్చిన స్థలంపై అభ్యంతరాలు రావడంతో ఇప్పుడు వివాదానాకి దారితీస్తోంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం వెంటనే స్పందించడం విశేషం. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తామన్నారు. చట్ట విరుద్ధమైన చర్యలకు తాము దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. తమ పార్టీ కమిటీ సదరు స్థలం పరిశీలించిన తర్వాతే ముందుకెళతామని స్పష్టం చేశారు.

దాంతో మంగ‌ళ‌గిరిలో పార్టీ ఆఫీసు నిర్మించాలని భావించిన స్ధ‌లం వివాదాస్ప‌ద‌మైన‌దైతే లీజు ర‌ద్దు చేసుకోవడానికి వెనకాడమని జనసేన స్పష్టం చేయడం విశేషంగా మారింది. తాజాగా యార్లగడ్డ వెంకటేశ్వర రావుకి చెందిన స్థలంలో జనసేన కార్యాలయం నిర్మాణం పై అజుమాన్ ఇస్లామిక్ సంస్థ ఆరోపణలు చేసింది. విజయవాడ ప్రెస్ క్లబ్ లో పలు ఆరోపణలు గుప్పించింది. ఆ స్థలం అక్రమించుకున్నారని వాపోయింది. దాంతో పవన్ స్పందించారు. అజుమాన్ ఇ స్లామిక్ ఆరోప‌ణ‌లు నా దృష్టికి వ‌చ్చాయ‌ని, నేను విజ‌య‌వాడ వ‌చ్చిన‌ప్పుడే నాకు చెప్పివుంటే ఇంత దూరం వ‌చ్చేది కాద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఒక రాజ‌కీయ వేత్త స‌మ‌క్షంలో మీడియాకు ఈ విష‌యం చెప్ప‌డం అనుమానాల‌కు తావిస్తోంద‌న్నారు. ఇది రాజ‌కీయ కుట్ర అయితే జ‌న‌సేన‌కు త‌ట్టుకునే శ‌క్తి ఉందని ప‌వ‌న్ తెలిపారు. త్వ‌ర‌లోనే జ‌న‌సేన నేత‌లు న్యాయ‌నిపుణుల‌తో క‌లిసి కాకానికి వ‌స్తార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.

దాంతో జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయం నిర్మాణమే కలకలం రేపుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి ఆ స్థలం ఇచ్చిన వ్యక్తికి పవన్ కల్యాణ్ ఆరోజే కాళ్లకు నమస్కరించడం చర్చనీయాంశం అయ్యింది. కానీ చివరకు కథ కొత్త మలుపు తిరగడం ఆసక్తిని రేపుతోంది.






Related News

టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన మునిసిప‌ల్ వ్య‌వ‌హారం

Spread the loveగుంటూరు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు గ‌రం గ‌రం అవుతున్నాయి. మునిసిపల్ రాజ‌కీయాలు పార్టీలో మంట‌లు రేపుతున్నాయి. జిల్లాలోనిRead More

రోజా వాద‌న‌ను అంగీక‌రించిన కోర్ట్

Spread the loveవైసీపీ ఎమ్మెల్యే రోజా ఎట్ట‌కేల‌కు న్యాయ‌స్థానంలో ఊర‌ట సాధించారు. ఆమె న్యాయ పోరాటం ఫ‌లించింది. టీడీపీ ఎమ్మెల్యేపైRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *