Main Menu

జ‌న‌సేన‌లో చేర‌ని వారికి కూడా ప‌ద‌వులు

Spread the love

కొత్త త‌ర‌హా రాజ‌కీయాలు చేస్తామ‌ని చెప్పిన జ‌న‌సేనాని మాట‌లు నిజ‌మ‌వుతున్నాయి. రాజ‌కీయాలు మార్చేస్తామ‌ని ఆయ‌న చెప్పిన మాట‌లు వాస్త‌వ రూపం దాలుస్తున్నాయి. నిజంగా రాజ‌కీయాల్లో కొత్త‌పోక‌డ‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌రీక్ష‌లు పెట్టి కార్య‌క‌ర్త‌ల‌ను రిక్రూట్ చేసుకుంటామంటూ చేసిన సంద‌డి ఏమ‌య్యిందో ఎవ‌రికీ తెలియ‌దు. తాజాగా పార్టీలో చేర‌క‌ముందే ప‌ద‌వులు అప్ప‌గించే వ్య‌వ‌హారంతో జ‌న‌సేన ఆస‌క్తిగా మారుతోంది. ఆపార్టీ వ్య‌వ‌హారాలు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

ఇప్ప‌టికే ఏడు మార్లు పార్టీ మారిన మాజీ మంత్రి ముత్తా గోపాల‌కృష్ణ‌ను జ‌న‌సేన‌లో చేర్చుకోవ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంగీక‌రించారు. అంతేగాకుండా ఆయ‌న‌కు పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీలో చోటు క‌ల్పించ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆయ‌న పార్టీలో చేర‌క‌ముందే ప‌ద‌విని ఖ‌రారు చేసేశారు. అంతేగాకుండా తూర్పు గోదావ‌రి జిల్లాలో జాయింట్ కోఆర్డినేట‌ర్లుగా ఇద్ద‌రు పేర్ల‌ను ప్ర‌క‌టించారు. కోఆర్డినేట‌ర్ గా కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన మేడా గురుద‌త్త ప్ర‌సాద్ ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో జాయింట్ ప‌ద‌వుల‌కు మ‌త్స్య‌కార సామాజిక‌వ‌ర్గం నుంచి పెసింగి ఆదినారాయ‌ణ‌, ఎస్సీ వ‌ర్గాల నుంచి శెట్టిబ‌త్తుల రాజ‌బాబుని నియ‌మించారు. అయితే ఈ ఇద్ద‌రూ నేటికీ జ‌న‌సేన‌లో చేరిన దాఖ‌లాలు లేవు.

పైగా శెట్టిబ‌త్తుల రాజ‌బాబుకి ప‌ద‌వి ప్ర‌క‌టించిన నాడే ఆయ‌న తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నాన‌ని, త్వ‌ర‌లో జ‌న‌సేన‌లో చేర‌తాన‌ని ప్ర‌క‌టించారు. అంటే ఆయ‌న ఇంకా పార్టీలోకి రాక‌ముందే ఏకంగా జిల్లా స్థాయి కోఆర్డినేట‌ర్ ప‌ద‌వి ఆయ‌న‌కు కట్ట‌బెట్ట‌డం విశేషంగానే చెప్ప‌వ‌చ్చు. ఇక పెసింగి ఆదినారాయ‌ణ కూడా అదే తీరు. నాలుగు రోజులు క్రిత‌మే ఆయ‌న సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ కార్య‌క్ర‌మాన్ని ద‌గ్గ‌రుండి నిర్వ‌హించారు. జిల్లా అంత‌టా ఆయ‌న వెంట ప‌ర్య‌టించారు. ఆయ‌న కూడా జ‌న‌సేన‌లో చేరిన దాఖ‌లాలే లేవు. ఆయినా ప‌ద‌వి ద‌క్కింది. అంటే జ‌న‌సేన జిల్లా నాయ‌క‌త్వంలోనే ఇలాంటి నేత‌లుంటే ఇక పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంటుందో చెప్ప‌న‌వ‌స‌రం లేద‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఇది కేవ‌లం తూర్పు గోదావ‌రి జిల్లాకే ప‌రిమితం కాలేద‌ని, అన్ని చోట్లా దాదాపు ఇదే ప‌రిస్థితిగా చెబుతున్నారు. దాంతో కొత్త రాజ‌కీయాల‌కు కొత్త భాష్యం జ‌న‌సేన నుంచి వినిపిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.






Related News

అమరావతిలో మళ్లీ లీకులు

Spread the love ఏపీ రాజధాని అమరావతిలో లీకుల పర్వం సాగుతోంది. గతంలో ప్రతిపక్ష నేత ఛాంబర్ లో లీకులొచ్చాయి.Read More

జోరు పెంచిన టీడీపీ!

Spread the loveటీడీపీ వ్యూహం మార్చింది. రాజ‌కీయంగా మ‌నుగ‌డ సాగించాలంటే మీడియాలో కొత్త పంథా అవ‌స‌రం అని గ్ర‌హించింది. దానికిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *