Main Menu

జ‌న‌సేన తొలి అభ్య‌ర్థి బ‌ల‌మెంత‌?

Spread the love

జ‌న‌సేన ఓ అడుగేసింది. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తున్న‌ట్టు వైసీపీ నేత‌లు ప్ర‌క‌టించ‌డం, టీడీపీ స‌న్నాహాల్లో ఉండ‌గానే తొలి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించి జ‌న‌సేనానిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. చివ‌ర‌కు పార్టీ ముఖ్య‌నేత‌ల‌కు కూడా ఎటువంటి స‌మాచారం ఇవ్వ‌కుండానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డం విశేషంగా చెప్ప‌వ‌చ్చు. అనూహ్యంగా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. కానిస్టేబుల్ కొడుకుగా సినీరంగంలో ప్ర‌వేశించిన ప‌వ‌న్ కుటుంబం ఉన్న‌త స్థానానికి ఎదిగింది. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో అడుగుపెట్టి, సొంతంగా పార్టీ పెట్టిన త‌ర్వాత తొలి అభ్య‌ర్థిగా ఓ కానిస్టేబుల్ నే ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. అందులోనూ జ‌న‌సేన మీద కాపు ముద్ర వేసిన త‌రుణంలో బీసీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం విశేషంగానే చెప్పాలి. అయితే జ‌న‌సేన‌కు అంతో ఇంతో బ‌ల‌ముంద‌ని భావిస్తున్న గోదావ‌రి జిల్లాల్లోనే తొలి అభ్య‌ర్థిని ఖాయం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక గ‌తంలో ప్ర‌జారాజ్యం త‌రుపున చిరంజీవి కూడా ఇలాంటి అనూహ్య నిర్ణ‌య‌మే తీసుకున్నారు. అప్ప‌ట్లో త‌న పార్టీ త‌రుపున తొలి అభ్య‌ర్థిగా మ‌ణెమ్మ‌ను రంగంలో దింపారు. నెల్లూరు జిల్లాలో జ‌న‌ర‌ల్ సీటులో ఎస్టీ మ‌హిళ‌ల‌కు చాన్స్ ఇచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఆ త‌ర్వాత ఆమె ఓట‌మి పాల‌య్యింది. ఇక తాజాగా ముమ్మిడివ‌రం అసెంబ్లీనియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీలో రెండేళ్ల పాటు నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ గా ఉన్న పితాని బాల‌కృష్ణ‌కు కండువా క‌ప్పుకున్న నాడే పార్టీ అభ్య‌ర్థితిత్వం ఖార‌రు చేయ‌డం విశేషంగానే చెప్పాలి.

కానిస్టేబుల్ గా ప‌నిచేసిన పితాని ప‌దవీకాలం ముగియ‌కుండానే రాజ‌కీయ ఆస‌క్తితో ఉద్యోగం వ‌దులుకున్నారు. వైసీపీ కోసం రెండేళ్ల పాటు ప‌నిచేశారు. కానీ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ పార్టీలో చేరిన త‌ర్వాత మ‌త్స్య‌కార సామాజిక‌వ‌ర్గం వైపు మొగ్గుచూపిన జ‌గ‌న్ , శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి చెందిన పితానిని ప‌క్క‌న పెట్టేశారు. దాంతో ర‌గిలిపోయిన బాల‌కృష్ణ ప‌వ‌న్ ని క‌లిసి, కండువా క‌ప్పుక‌న్న నాడే బీఫారం అందుకోబోతున్న తొలి అభ్య‌ర్థి కాగ‌లిగారు.

అయితే ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాట్లు బుచ్చిబాబు క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత కావ‌డ‌మే కాకుండా ఆర్థికంగా ద‌న్ను క‌లిగిన ఉన్నారు. దాంతో ఆయ‌న్ని ఢీ కొట్టాలంటే జ‌న‌సేన అభ్య‌ర్థి తీవ్రంగా శ్ర‌మించాల్సి ఉంటుంది. వైసీపీ అభ్య‌ర్థి పొన్నాడ స‌తీష్ కూడా మాజీ ఎమ్మెల్యే కావ‌డం, ఆర్థికంగా స్థిర‌మైన నేత కావ‌డం పైగా సొంత సామాజిక‌వ‌ర్గం మ‌త్స్య‌కారుల అండ ఉండ‌డం విశేషం. దాంతో ఇక్క‌డ జ‌న‌సేన ప‌ట్టు సాధించాలంటే కాపు, శెట్టిబ‌లిజ క‌ల‌యిక తోడ్ప‌డుతుంద‌ని ప‌వ‌న్ ఆశించిన‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో పీఆర్పీ కూడా ముమ్మ‌డివ‌రంలో శెట్టిబ‌లిజ‌కు చెందిన కుడుపూడి సూర్య‌నారాయ‌ణ‌కు చాన్సిచ్చింది. కానీ అప్ప‌ట్లో కాంగ్రెస్ తరుపున పొన్నాడ స‌తీష్ విజ‌యం సాధించారు. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముమ్మిడివ‌రం రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది.


Related News

రీపోలింగ్ త‌ప్ప‌లేదు..

Spread the loveఏపీ ఎన్నిక‌ల్లో రీపోలింగ్ త‌ప్ప‌లేదు. రాష్ట్రంలోని మూడు జిల్లాల ప‌రిధిలో రీపోలింగ్ కి ఈసీ నిర్ణ‌యం తీసుకుంది.Read More

వైసీపీకి ఎదురుదెబ్బ‌!

Spread the loveగ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ట్టిగా పోరాడినా చివ‌రిలో చ‌తికిల‌ప‌డింది. ఈసారి అలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాకూడ‌ద‌ని ఆశిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *