Main Menu

మర్యాద కోస‌మే..ఊహ‌లొద్దంటున్న ప‌వ‌న్

Spread the love

జ‌న‌సేనాని తాజాగా మ‌రో క్లారిటీ ఇచ్చేశారు. చంద్ర‌బాబుతో త‌న సంబంధాల ప‌ట్ల స్ప‌ష్ట‌త ఉంద‌న్నారు. ముఖ్యంగా గుంటూరులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబుతో భేటీ కావ‌డంపై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆయ‌న కొట్టిపారేశారు. త‌న క‌ల‌యిక యాధృశ్చికం అని, కేవ‌లం మ‌ర్యాద పూర్వకం అని తేల్చేశారు. ట్విట్ట‌ర్ లో త‌న అభిప్రాయం వెల్ల‌డించారు. చంద్ర‌బాబుతో జ‌రిగిన భేటీతో ఏదో జరిగిపోతుందని ఊహించుకోవద్దంటూ సూచించారు. ‘‘టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వివిధ రకాల ప్రజా కార్యక్రమాల్లో తారసపడుతుంటారు. అలాంటి సమయాల్లో మర్యాద పూర్వకంగా పలకరించి, వారి యోగక్షేమాలు తెలుసుకోవడం నా విధి. దయచేసి ఇలాంటివి జరిగినప్పుడు రాజకీయ పార్టీల నాయకులు, ఇతరులు ఏదో జరిగిపోతోందంటూ ఊహించుకోవద్దు’’ అని పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దాంతో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య సంబంధాల‌కు ఇదే సాక్ష్యం అంటూ వైసీపీ స‌హా వివిధ పార్టీల శ్రేణులు సోష‌ల్ మీడియాలో సాగిస్తున్న ప్ర‌చారాన్ని ప‌వ‌న్ తిప్పికొట్టిన‌ట్ట‌య్యింది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుతో ఆల‌యం బ‌య‌ట అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించి, లోప‌ల 15 నిమిషాల పాటు ఏకాంతంగా గ‌డ‌ప‌డం వెనుక పెద్ద విశేషం లేద‌ని ఆయ‌న చెబుతున్నారు. కానీ లింగ‌మ‌నేని ర‌మేష్ సాక్షిగా సాగిన ఈ వ్య‌వ‌హారంపై అనుమానాలు మాత్రం విస్తృతంగా ప్ర‌చారంలో ఉన్నాయి.






Related News

ఆర్కే ప్ర‌త్య‌ర్థి అత‌డే..!

Spread the loveవ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అన్ని పార్టీలు కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నారు. వ‌చ్చే మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఈసీRead More

జ‌న‌సేనాని..ఓ సారి వెన‌క్కి చూసుకో..!

Spread the loveరాజ‌కీయ మార్పు కోసం అంటూ ముంద‌డుగు వేసిన జ‌న‌సేనానికి అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఏపీలో స‌మీక‌ర‌ణ కోసం ఏరీతినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *