Main Menu

జ‌లీల్ ఖాన్ కి షాక్ ..!

Spread the love

ఏపీ వక్ఫ్‌బోర్డు చైర్మ‌న్, విజ‌య‌వాడ వెస్ట్ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ కి షాక్ త‌గిలింది. సొంత వ‌ర్గంలోనే ఆయ‌న‌కు తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అయ్యింది. చివ‌ర‌కు నిర‌స‌న‌ల రూపం దాల్చింది. వక్ఫ్‌బోర్డు ఆస్తులు కాపాడాలంటూ విప‌క్షాలు నిర‌స‌న‌ల‌కు దిగ‌డం, మైనార్టీలు అండ‌గా నిల‌వ‌డంతో జ‌లీల్ ఖాన్ నిర్ణ‌యాన్ని మార్చుకోవాల్సి వ‌చ్చింది. వెన‌కుడు వేయ‌క త‌ప్ప‌ని స్థితి ఏర్ప‌డింది.

దాంతో నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకుంటూ జ‌లీల్ ఖాన్ ప్ర‌క‌ట‌న చేశారు. జామా మసీదు ఆస్తులు లీజు వ్య‌వ‌హారంలో నిర్ణ‌యం స‌వ‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌సీదు ఆస్తుల లీజు వ్య‌వ‌హారం వేలం ద్వారా జ‌రిగింద‌న్నారు. తాను అవినీతికి పాల్ప‌డిన‌ట్టు సాగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్నారు. వేలంలో అధికంగా కోడ్‌ చేసినవారికే లీజుకిచ్చామని తెలిపారు. అయినా ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాల నేప‌థ్యంలో చంద‌నా బ్ర‌ద‌ర్స్ తో చేసుకున్న ఒప్పందం ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే బ‌హిరంగ వేలం వేస్తామ‌ని ప్ర‌క‌టించారు

కారుచౌక‌గా మ‌సీదు ఆస్తులు క‌ట్ట‌బెట్టిన విష‌యం విజ‌య‌వాడ‌లో రాజ‌కీయంగా దుమారం రేపింది. లెఫ్ట్, జ‌న‌సేన నేత‌లు ఆందోళ‌న‌ల‌కు దిగారు. దాంతో టీడీపీ నాయ‌క‌త్వం దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగిన‌ట్టు తెలుస్తోంది. జ‌లీల్ ఖాన్ ని గ‌ట్టిగా హెచ్చ‌రించ‌డ‌మే కాకుండా, అగ్రిమెంట్ ర‌ద్దు చేసుకోవాలంటూ అధిష్టానం నుంచి వ‌చ్చిన ఆదేశాల‌తో చివ‌ర‌కు చైర్మ‌న్ జ‌లీల్ ఖాన్ నిర్ణ‌యం ఉప‌సంహ‌రించుకున్న‌ట్టు చెబుతున్నారు. ఏమ‌యిన‌ప్ప‌టికీ జ‌లీల్ ఖాన్ కి మ‌రోసారి ఈ వ్య‌వ‌హారంలో త‌ల‌బొప్పిక‌ట్టింద‌నే చెప్ప‌వ‌చ్చు.






Related News

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

2019 వైసీపీ అభ్యర్థుల విశ్లేషణ

Spread the loveబీసీలకు, అనుభవానికి, నమ్మకానికి, పెద్దపీట యువతకు సముచిత ప్రాధాన్యం అభ్యర్థుల్లో పెద్దసంఖ్యలో ఉన్నతచదువులు చదువుకున్నవారు అభ్యర్థుల్లో 9Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *