Main Menu

ఏపీ స‌మ‌స్య‌ల‌న్నింటికీ జ‌గ‌నే కార‌ణం….

Spread the love

ఈ విష‌యం ఇప్ప‌టిది కాదు..చంద్ర‌బాబు గ‌ద్దెనెక్కిన నాటి నుంచి చెబుతున్న మాట‌. రాష్ట్ర విభ‌జ‌న‌కు సీపీఎం మిన‌హా చంద్ర‌బాబుతో స‌హా అంద‌రూ లేఖ‌లిచ్చి స‌హ‌క‌రించిన‌ప్ప‌టికీ ఆ నేరం అంతా కాంగ్రెస్ దే అంటారు. పైగా తెలంగాణాలో మాత్రం విభ‌జ‌న‌కు తానే కార‌ణం అని చెప్పుకుంటారు. అదే స‌మ‌యంలో ఏపీలో ఏ స‌మ‌స్య వ‌చ్చినా దానికి కార‌ణం విప‌క్ష నేత మీద వేస్తుంటారు. ఇప్ప‌టికే అనేక అంశాల‌లో అంద‌రూ ఊశాం. రాజ‌ధానిలో రైతుల పొలాలు త‌గుల‌బెట్టినా, నాణ్య‌తాలోపం ప‌ట్టిసీమ కాలువ కుంగినా, కాపుల రిజ‌ర్వేష‌న్ల కోసం రైలు త‌గుల‌బెట్టినా ఇంకా ఏం జ‌రిగినా విప‌క్ష‌మే కార‌ణ‌మ‌ని ఆరోపించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అన్నింటికీ మించి ప్ర‌స్తుతం ఏపీలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌కు మాత్రం వైఎస్ జ‌గ‌న్ కార‌ణ‌మ‌ని అటు టీడీపీ, ఇటు బీజేపీ కూడా ఆరోపిస్తుండ‌డం విశేషం. బీజేపీ ఎల్పీ నాయ‌కుడు విష్ణుకుమార్ రాజు అయితే ఓ అడుగు ముందుకేసి త‌మ బంధం బ్రేక‌ప్ కి కార‌ణం జ‌గ‌న్ పాద‌యాత్రేన‌ని పేర్కొన్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర పేరుతో ప్ర‌త్యేక హోదా నినాదం రాజేశార‌ని, అది టీడీపీ మీద ఒత్తిడి పెరిగి ఆఖ‌రికి చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డానికి కార‌ణం అయ్యింద‌న్న‌ట్టుగా ఆయ‌న పేర్కొన్నారు.

అయితే బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌లు, టీడీపీ ఆరోప‌ణ‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్ కొంత కృషి చేశారు. ఆయ‌న‌కు ఉన్న ప‌రిమితుల రీత్యా కేంద్ర ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిల‌దీయ‌లేక‌పోయార‌న్న విష‌యం వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ హోదా కోసం యువ‌భేరీలు మోగించి నిత్యం దానిని నిల‌బెట్టిన ఘ‌న‌త జ‌గ‌న్ దే. అంతేగాకుండా వైజాగ్ లో బ‌హిరంగ‌స‌భ పెట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ఎజెండా ప్ర‌త్యేక హోదానే అని ఏడాదిన్న‌ర క్రిత‌మే ప్ర‌క‌టించిన చ‌రిత్ర జ‌గ‌న్ కి ఉంది. గ‌త ఏడాది జ‌న‌వ‌రి 26నాడు ఏకంగా ర‌న్ వే మీద ధ‌ర్నాకి దిగ‌డం ద్వారా క‌ల‌క‌లం రేపింది కూడా జ‌గ‌న్ కావ‌డం విశేషం. ఇలా ప్ర‌త్యేక హోదా అనే అంశంలో జ‌గ‌న్ పాత్ర పెద్ద‌దే అని చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేగాకుండా ప్ర‌స్తుతం హోదా పేరుతో రాజీనామాలు, అవిశ్వాస తీర్మానం అంటూ వ‌చ్చిన స‌వాళ్ల‌ని త‌క్ష‌ణం స్వీక‌రించి, వెనుకాడేది లేదని ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా, హ‌స్తిన వెళ్లి ఆందోళ‌న చేసిన అరెస్టుల వ‌ర‌కూ తెగించింది కూడా వైసీపీ నేత‌లే కావ‌డం విశేషం. ఇవ‌న్నీ క‌లిసి హోదా సెంటిమెంట్ ని లైవ్ లో ఉంచ‌డానికి తోడ్ప‌డ్డాయి. చివ‌ర‌కు ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ పుణ్యాన చంద్ర‌బాబు మీద తీవ్ర ఒత్తిడి పెంచాయ‌న‌డంలో సందేహం లేదు. హోదా వ‌ద్ద‌ని, ప్యాకేజీ ముద్ద‌ని చెప్పిన నాయ‌కుడు కూడా మాట మార్చి మ‌ళ్లీ హోదా కోసం రాజీనామాలు చేస్తున్నామ‌ని చెప్ప‌డం వ‌ర‌కూ ప‌రిణామాలు మార‌డం జ‌గ‌న్ వ్య‌వ‌హారం పుణ్య‌మేన‌ని ప‌రిశీల‌కులు సైతం అంగీక‌రిస్తున్నారు.

దాంతో ప్ర‌స్తుతం బీజేపీ, టీడీపీ బ్రేక‌ప్ కి, ఏపీ రాజ‌కీయాల్లో తొలిసారిగా టీడీపీ దాదాపుగా ఒంట‌రిగా మార‌డానికి కార‌ణం జ‌గ‌న్ అని చెప్ప‌వ‌చ్చు. టీడీపీ ఆవిర్భావం నాటినుంచి ఒంట‌రిగా పోటీ చేసిన అనుభ‌వ‌మే లేదు. ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ ఏదో పార్టీతో పొత్తు పెట్టుకుని మాత్ర‌మే బ‌రిలో దిగారు. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రితో క‌లిసి వెళ్లాల‌నే సందిగ్ధం ఇప్పుడు టీడీపీని చుట్టిముట్టింది. జ‌న‌సేన ఏమేర‌కు క‌లిసొస్తుందో అనే సందేహం వెంటాడుతోంది. బీజేపీ దూరం అయ్యింది. లెఫ్ట్ క‌లిసే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. దాంతో టీడీపీకి ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి ఉంది. ఈ ప‌రిణామాల‌న్నింటికీ కార‌ణ‌మ‌యిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్ పాత్ర మాత్రం కొట్టిపారేయ‌లేనిద‌ని చెప్ప‌వ‌చ్చు.


Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the loveఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *