బాబు పై గురిపెట్టిన మాజీ సీఎస్

iyr
Spread the love

మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చారు. ఏపీ సీఎం పేషీని టార్గెట్ చేశారు. రెండు నెల‌ల క్రితం బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి కోల్పోయిన ఐవైఆర్ ఆ త‌ర్వాత కొంత వెన‌క్కి త‌గ్గారు. అమ‌రావ‌తి వ్య‌వ‌హారాల మీద పుస్త‌కం రాస్తాన‌ని చెప్పిన‌ప్ప‌టికీ ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు క‌నిపించ‌లేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా చంద్ర‌బాబుకి బ‌హిరంగ‌లేఖ రాస్తూ నేరుగా స‌ర్కారు వ్య‌వ‌హారాల మీద గుర్తుపెట్ట‌డం విశేషం.

సీఎంవో ఇష్టారీతి శైలిపై చంద్రబాబుకు రాసిన లేఖలో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం చంద్రబాబు కార్యాలయం రాజ్యాంగేతర శక్తిగా మారిందని, పాలనలో ఏ మాత్రం పారదర్శకత కొనసాగడం లేదని, సంస్కరణలు అసలే అమలు చేయడం లేదని తన లేఖలో ఐవైఆర్ పేర్కొన్నారు. సమాంతర సెక్రటేరియట్‌గా సీఎం చంద్రబాబు కార్యాలయం పనిచేయడంపై ఆయన తన అసంతృప్తిని వెల్లగక్కారు. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగేంచాలా సీఎం కార్యాలయం పనిచేయడంపై ఐవైఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

నిర్దేశించిన నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు పనిచేయడం లేదని, సీఎంవోలో రికార్డులన్నీ పదిల పరిచేలా చర్యలు తీసుకోవాలని తన లేఖ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఫైళ్లపై సీఎంవో అధికారుల సంతకాలు లేకపోవడంతో ఏపీ వారికి ఇష్టారాజ్యమైపోయిందని, సీఎంవో ఆఫీసు కోసం ప్రత్యేక మాన్యువల్ రూపొందించాల్సిన అవసరం ఉందని తన లేఖ ద్వారా ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.


Related News

shivaji

శివాజీ కామెంట్స్ చుట్టూ ర‌చ్చ‌

Spread the loveఅప‌రేష‌న్ గ‌రుడ‌..ఆప‌రేష‌న్ ద్రావిడ‌..రెండు రోజులుగా ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశాలుగా మారాయి. దానికి కార‌ణం సినీ న‌టుడు శివాజీRead More

Its-Not-Jana-Sena--Kapu-Sena--Kathi-Mahesh-1512798570-1316

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి దొరికిన క‌త్తి మ‌హేష్

Spread the loveఫిల్మ్ క్రిటిక్ గా కెరీర్ ప్రారంభించి కొంత కాలంగా పొలిటిక‌ల్ ఎనాలిసిస్ కి సిద్ధ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా అవ‌కాశంRead More

 • త‌న అభిప్రాయంతో జ‌నం ఏకీభ‌వించ‌డంలేదంటున్న ప‌వ‌న్
 • కాబోయే మంత్రి ఎవ‌రు..?
 • మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!
 • కామినేనిపై క‌త్తిలాంటి సెటైర్
 • ఏపీ స‌మ‌స్య‌ల‌న్నింటికీ జ‌గ‌నే కార‌ణం….
 • రివ‌ర్స్ ఎటాక్ ప్రారంభించిన క‌మ‌ల‌నాధులు
 • టీడీపీ రాజీనామాల నిర్ణ‌యం:దూరంగా ఉన్న‌మంత్రి
 • ఏపీకి టోపీ పెట్టేశారు…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *