Main Menu

ఐవైఆర్ నిర్ణ‌యం మేలు చేస్తుందా?

Spread the love

ఏపీలో మ‌రో ఆస‌క్తిక‌ర రాజ‌కీయ ప‌రిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పిలుపుమేర‌కు తాను కాషాయం గూటికి చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేతుల మీదుగా కండువా క‌ప్పుకున్నారు. హైద‌రాబాద్ లో అమిత్ షాని క‌లిసిన ఐవైఆర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

దాంతో ఐవైఆర్ నిర్ణ‌యం ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయంగా ఆయ‌న పాత్ర మీద చ‌ర్చ మొద‌ల‌య్యింది. గ‌డిచిన ఏడాది కాలంగా ఆయ‌న చంద్ర‌బాబు తీరు మీద తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. వివిధ వేదిక‌ల‌పై చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌డుతున్నారు. అదే స‌మ‌యంలో వారం రోజుల క్రితం జ‌గ‌న్ నిర్వ‌హించిన బ్రాహ్మ‌ణుల ఆత్మీయ స‌మ్మేళ‌నానికి హాజ‌ర‌య్యారు. వైసీపీ వైపు సానుకూలంగా ఉన్న‌ట్టు క‌న‌పించారు.

కానీ అనూహ్యంగా క‌మ‌లం గూటికి చేర‌డం విశేషంగా మారింది. అయితే వైసీపీ. బీజేపీ మ‌ధ్య సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ‌డానికి కృష్ణారావు నిర్ణ‌యం దోహ‌ద‌ప‌డుతుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. జ‌గ‌న్ తో స్నేహం ఉండ‌డం, బీజేపీ నేత‌గా మార‌డంతో ఉభ‌య ప‌క్షాల మ‌ధ్య సంధాన‌క‌ర్త‌గా ఐవైఆర్ వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వాస్త‌వానికి జ‌గ‌న్ తో పాటు విజ‌య‌సాయి రెడ్డికి కూడా బీజేపీ జాతీయ నేత‌ల‌తో మంచి సంబంధాలున్న‌ప్ప‌టికీ ఏపీ నేత‌ల‌తో మాత్రం పూర్తి సాన్నిహిత్యం లేదు. ఇప్పుడు ఐవైఆర్ చేరిక త‌ర్వాత ఆ లోటు కూడా తీరుంద‌నే వారు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. అయితే ఏపీలో కుదేల‌వుతున్న క‌మ‌లానికి కృష్ణారావు ఏమేర‌కు తోడ్ప‌డ‌గ‌ల‌ర‌న్న‌ది సందేహంగానే చెప్పాలి.






Related News

టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన మునిసిప‌ల్ వ్య‌వ‌హారం

Spread the loveగుంటూరు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు గ‌రం గ‌రం అవుతున్నాయి. మునిసిపల్ రాజ‌కీయాలు పార్టీలో మంట‌లు రేపుతున్నాయి. జిల్లాలోనిRead More

రోజా వాద‌న‌ను అంగీక‌రించిన కోర్ట్

Spread the loveవైసీపీ ఎమ్మెల్యే రోజా ఎట్ట‌కేల‌కు న్యాయ‌స్థానంలో ఊర‌ట సాధించారు. ఆమె న్యాయ పోరాటం ఫ‌లించింది. టీడీపీ ఎమ్మెల్యేపైRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *