Main Menu

దుమారం రేపేలా ఉన్న బాబుకి కలెక్టర్ల లేఖ

Spread the love

ఏపీలో ఐఏఎస్ ఆఫీసర్స్ ఆసోసియేషన్ ఘాటు లేఖాస్త్రం సంధించింది. చంద్రబాబు తీరుపై తీవ్రంగా వ్యాఖ్యానించింది. అదే సమయంలో తెలుగు తమ్ముళ్ల అవినీతి బండారం బయటపెట్టింది. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిదాయకంగా మారుతోంది.

తాను చేస్తున్న అభివృద్ధి పనులకి కలెక్టర్లు సహకరించటం లేదని అవసరమైతే వాళ్లకి వ్యతిరేకంగా దీక్ష చేస్తానని బెదిరించిన చంద్రబాబు తీరుని వారంతా తప్పుబట్టారు. ప్రభుత్వ అవినీతి వ్యవహారాల్లో తాము భాగస్వామ్యం కాలేమని తేల్చిచెప్పారు. కనీసం పనులు కూడా చేయకుండా అధికార పార్టీ కార్యకర్తలు దౌర్జన్యంగా బిల్లులు తీసుకొంటున్నారని ముఖ్యమంత్రికి వ్రాసిన బహిరంగ లేఖలో పేర్కొనడం సంచలనంగా మారింది.

అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 992 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 836 కోట్లు , మొత్తం 1830 కోట్లకి కేవలం 1200 కోట్లకి పనులు చేసినట్లు చూపెట్టి మిగతా 600 కోట్లు తెలుగుదేశం కార్యాకార్యాలు దోచుకొన్నారని లేఖలో ప్రస్తావించడం ద్వారా ఐఏఎస్ అధికారులు కలకలం రేపారు. .1200 కోట్లకి కూడా కేవలం లెక్కలు మాత్రమే చెప్తున్నారని వాస్తవానికి పనులు ఎక్కడా జరగలేదని ఆరోపించడం విశేషం .

స్వయంగా మంత్రులే ఒత్తిడి చేసి సంతకాలు చేయించుకొని బిల్లులు మార్చుకొంటున్నారని మీకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కనీసం స్పదించలేదని , మీ నాయకులపై చర్యలు తీసుకోకుండా మాపై నిందలు వేయటం భావ్యం కాదని , ఒకవేళ ఇష్టం లేకపోతె మమ్మల్ని బదిలీ చేయాలని నేరుగా సీఎంని ఉద్దేశించిన లేఖలో పేర్కొన్న తీరు దుమారం రేపబోతోంది.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ లేఖ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పేరుతో వైరల్ అవుతోంది. అనుభవం, అత్యంత సమర్ధుడిగా చెప్పుకునే చంద్రబాబు పాలనా తీరుని ఉన్నతాధికారులు ఎండగట్టిన తీరు రాజకీయంగా ప్రకంపనలు రేపే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడంతో పెద్ద చర్చకు దారితీయడం ఖాయం. అదే సమయంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ లెటర్ ని ఎవరూ నిర్ధారించలేదు.దాంతో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఈ స్థాయిలో ప్రభుత్వానికి లేఖలు రాసి ఉంటారా అన్నది సందేహాస్పదంగా ఉంది. దాంతో నిర్థారణ జరగాల్సి ఉంది. ఇప్పటి వరకూ మాత్రం స్పందించకపోవడం విశేషం.






Related News

టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన మునిసిప‌ల్ వ్య‌వ‌హారం

Spread the loveగుంటూరు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు గ‌రం గ‌రం అవుతున్నాయి. మునిసిపల్ రాజ‌కీయాలు పార్టీలో మంట‌లు రేపుతున్నాయి. జిల్లాలోనిRead More

రోజా వాద‌న‌ను అంగీక‌రించిన కోర్ట్

Spread the loveవైసీపీ ఎమ్మెల్యే రోజా ఎట్ట‌కేల‌కు న్యాయ‌స్థానంలో ఊర‌ట సాధించారు. ఆమె న్యాయ పోరాటం ఫ‌లించింది. టీడీపీ ఎమ్మెల్యేపైRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *