Main Menu

పెనమలూరు ఎమ్మెల్యేపై దాడి

b ode prasad
Spread the love

పెనమలూరు ఎమ్మెల్యేపై దాడి జరిగింది. అయితే దాడి చేసింది ప్రత్యర్థులు మాత్రం కాదు. తేనెటీగల దాడితో ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరి కావాల్సి వచ్చింది. కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పై ఒక్కసారిగా తేనెటీగలు దాడికి పాల్పడడం కలకలం రేపింది. దీంతో, తన చొక్కా గుండీలు విప్పి మరీ, ఆయన తేనెటీగలను విదిలించుకోవాల్సి వచ్చింది. కంకిపాడు మండలం ఈడ్పుగల్లులోని స్వచ్ఛ కృష్ణ్ణ ఆత్మగౌరవ దీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఈ సంఘటన జరిగింది. ఈడ్పుగల్లు హైస్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మీటింగ్ నిర్వహించే ప్రదేశానికి చేరుకుంటుందనగా తేనెటీగలు ఆయనను చుట్టుముట్టాయి. దాంతో ఎమ్మెల్యే పరుగు పరుగున అక్కడి నుంచి ఉరుకులు పరుగుల మీద తలదాచుకోవడానికి ఆయన ప్రయత్నించాల్సి వచ్చింది. చివరకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.






Related News

pawan cbn

జ‌న‌సేన‌తో చంద్ర‌బాబు మైండ్ గేమ్

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో వేడి రాజుకుంటోంది. బాబుకి జాతీయ స్థాయి నేత‌ల‌తో సాన్నిహిత్యం రీత్యా. తాజా అవ‌స‌రాల కోసంRead More

chandrababu-ashok-babu-Socialpost

టీడీపీ అభ్యర్థిగా అశోక్ బాబు

Spread the loveతెలుగుదేశం పార్టీ తరుపున మరో ఉద్యోగ సంఘం నాయకుడు రంగం మీదకు రాబోతున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *