Main Menu

ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్?

Spread the love

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి కొత్త గ‌వ‌ర్న‌ర్ పై మ‌రోసారి క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఇలాంటి వార్త‌లు వ‌చ్చిన‌ప్పటికీ ఆచ‌ర‌ణ‌లో క‌నిపించ‌లేదు. ఇక తాజాగా ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ రాజీనామా చేసిన‌ట్టు చెబుతున్నారు. దాంతో ఆయ‌న స్థానంలో అనివార్యంగా కొత్త గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం త‌ప్ప‌నిస‌రిగా మారిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే కొత్త గ‌వ‌ర్న‌ర్ ని ఉమ్మ‌డి రాష్ట్రాల‌కు నియ‌మిస్తారా లేక కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ప్ర‌త్యేకంగా నియ‌మిస్తారా అన్న‌ది తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఈ జాబితాలో బాలాజీరావు పేరు వినిపిస్తోంది. ఆయ‌న బీజేపీ నేప‌థ్యంలో ఉన్న మాజీ అధికారిగా చెబుతున్నారు. ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త రాలేద‌ని స‌మాచారం.

అయితే ఇప్ప‌టికే సుమారు 9ఏళ్లు నిండిపోతున్న ఈఎస్ఎల్ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వీ కాలం ఇంకా పొడిగించ‌డం శ్రేయ‌స్క‌రం కాద‌నే ఆలోచ‌న‌లో కేంద్రం ఉండ‌డంతోనే ఎన్నిక‌ల‌కు ముందు ఈ మార్పు జ‌రుగుతున్న‌ట్టు చెబుతున్నారు. 2009 డిసెంబ‌ర్ లో న‌ర‌సింహ‌న్ ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.రాష్ట్ర విభ‌జ‌న‌కు ఆయ‌న సాక్ష్యంగా ఉన్నారు. విభ‌జ‌న అనంత‌రం గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంగా కూడా ఆయ‌నే రెండు రాష్ట్రాల బాధ్య‌త నిర్వ‌హిస్తుండ‌డం విశేసం.






Related News

వైసీపీకి షాకిచ్చి, జ‌న‌సేన‌లోకి..!

Spread the loveఏపీలో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. వారు వీర‌వుతార‌న్న‌ట్టుగా ప‌రిస్థితులు మారుతున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగా ఈ వ్య‌వ‌హారాల‌ను తానుRead More

రామోజీపై క్రిమిన‌ల్ ప్రోసిడింగ్స్ కి సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్

Spread the loveఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు కి చెందిన మార్గ‌ద‌ర్శి వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. గ‌తంలో వైఎస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *