Main Menu

గల్లా జయదేవ్ కి కోపం వ‌చ్చింది..

Spread the love

తెలుగుదేశం ఎంపీ కి కోపం వ‌చ్చింది. ఒక్క‌సారిగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాంతో మీడియా ప్ర‌తినిధులు అవాక్క‌య్యారు. గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ తీరుతో ఖంగుతిన్నారు. మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న సీరియ‌స్ గా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఇటీవ‌ల పార్ల‌మెంట్ లో ప్ర‌సంగం త‌ర్వాత ఆయ‌నకు ఘ‌న స్వాగ‌తాలు, స‌న్మానాలు ఏర్పాటు చేయ‌డాన్ని మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు. ఏం సాధించార‌ని స‌న్మానాలు చేసుకున్నారంటూ ప్ర‌శ్నించ‌డంతో ఎంపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తీవ్రంగా అస‌హ‌నం చెందిన ఆయ‌న సబ్జెక్ట్‌ను పక్కదోవ పట్టించవద్దంటూ క‌స్సుమ‌న్నారు. మీరు మాకు సన్మానం చేస్తారా అంటూ ఎదురు ప్రశ్నించారు. తాను ఎక్కడా సన్మానాలు చేయించుకోలేదని, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో చేశారని, దాన్ని తాము కాదనలేకపోయామని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో ఎంపీ స్పంద‌న చూసిన మీడియా సిబ్బంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.






Related News

టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన మునిసిప‌ల్ వ్య‌వ‌హారం

Spread the loveగుంటూరు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు గ‌రం గ‌రం అవుతున్నాయి. మునిసిపల్ రాజ‌కీయాలు పార్టీలో మంట‌లు రేపుతున్నాయి. జిల్లాలోనిRead More

రోజా వాద‌న‌ను అంగీక‌రించిన కోర్ట్

Spread the loveవైసీపీ ఎమ్మెల్యే రోజా ఎట్ట‌కేల‌కు న్యాయ‌స్థానంలో ఊర‌ట సాధించారు. ఆమె న్యాయ పోరాటం ఫ‌లించింది. టీడీపీ ఎమ్మెల్యేపైRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *