Main Menu

టీడీపీ స‌ర్పంచ్ వ్య‌వ‌హారంలో వైసీపీ నేత‌లు…

Spread the love

త‌న భ‌ర్త వేధిస్తున్నాడంటూ టీడీపీ స‌ర్పంచ్ సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచ‌ల‌నం అవుతోంది. ఇప్ప‌టికే కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా వైసీపీ నేత ఒక‌రు ఆ పోస్ట్ కి లైక్ కొట్ట‌డంతో క‌థ కొత్త మ‌లుపు తిరిగింది. స‌ర్పంచ్ భ‌ర్త త‌గాదాకి దిగ‌డంతో ఉద్రిక్త‌త‌కు దారితీసింది. చివ‌ర‌కు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది.

కృష్ణా జిల్లాలో తేలప్రోలు సర్పంచ్‌ హరిణీ కుమారిని ఆమె భ‌ర్త రామ‌కృష్ణ వేధిస్తుండ‌డంతో వారి మ‌ధ్య వివాదం మొద‌ల‌య్యింది. పోలీస్ స్టేష‌న్ లో ఒత్తిడి తెచ్చి తాను ఫిర్యాదు చేసినా, ప‌క్క‌న పెట్టేసేలా చేశార‌ని హ‌రిణీ సోష‌ల్ మీడియాలో వాపోయింది. అది వైర‌ల్ గా మారింది. ఈ నేప‌థ్యంలో ఆపోస్ట్ కి అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయ‌కుడు భీమ‌వ‌ర‌పు నాగిరెడ్డి లైక్ కొట్ట‌డం తో రామ‌కృష్ణ‌కు ఆగ్ర‌హం క‌లిగించింది. ఏకంగా వైసీపీ కార్యాల‌యానికి వెళ్లిన హ‌రిణీ భ‌ర్త నాగిరెడ్డితో వాగ్వాదానికి దిగ‌డం వివాదాస్ప‌దం అయ్యింది.

హ‌రిణీ సోష‌ల్ మీడియా పోస్ట్ త‌ర్వాత పోలీసుల్లో కూడా క‌ద‌లికి వ‌చ్చింది. గ‌న్న‌వ‌రం పీఎస్ లో 498ఏ కేసు రామ‌కృష్ణ మీద న‌మోద‌య్యింది. ఈ నేప‌థ్యంలో రామ‌కృష్ణ‌, నాగిరెడ్డి తోపులాట‌కు దిగ‌డంతో టీడీపీ, వైసీపీ వ‌ర్గాలు అక్క‌డికి చేరుకున్నాయి. దాంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసి తేల‌ప్రోలులో ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.






Related News

ఏపీలో ఒంట‌రి జ‌గ‌న్!

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో వైఎస్ జ‌గ‌న్ ఒంట‌రి అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఏకాకిగా మిగిలిన బీజేపీకి ఆయ‌న మాత్ర‌మేRead More

మైల‌వ‌రంలో ప‌రువు పోయింది..!

Spread the loveకృష్ణా జిల్లాలో కీల‌క‌మైన మైల‌వ‌రం ప‌రిణామాలు ఇప్పుడు ఆస‌క్తిగా మారుతున్నాయి. తాజాగా వ‌సంత‌కృష్ణ ప్ర‌సాద్ మీద పెట్టినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *