Main Menu

జ‌న‌సేనానికి కంటి స‌మ‌స్య‌లు

Spread the love

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయ‌న్ని కంటి స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే ఓమారు ఆయ‌న చికిత్స చేయించుకున్న‌ప్ప‌టికీ అది పూర్తిగా తొల‌గ‌లేదు. దాంతో తాజాగా మ‌రోసారి ఎల్వీ ప్ర‌సాద్ ఆస్ప‌త్రిలో శ‌స్త్ర చికిత్స్ చేయించుకోవాల్సి వ‌చ్చింది.

గ‌తంలో పెద్ద‌గా ప్ర‌జ‌లతో క‌లిసి సాగిన అనుభ‌వం లేని ప‌వ‌న్ ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటున్నారు. ఆ సంద‌ర్భంగా పూలు జ‌ల్లుతున్న అభిమానుల మూలంగా ఆయ‌న‌కు స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్టు చెబుతున్నారు. ప‌లుమార్లు పూల‌రెక్క‌లు కంటిని తాక‌డం ఆయ‌న‌కు తీవ్ర స‌మ‌స్య అవుతోంద‌ని వైద్యులు భావిస్తున్నారు. పరిశీలించిన నిపుణులు ఎడమ కంటిలో కురుపు అయిందని, శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఇటీవల ఓ సందర్భంలో పవన్ మాట్లాడుతూ తాను చలువ కళ్లద్దాలు పెట్టుకుంటున్నదని స్టైల్ కోసం కాదని, కంటి సమస్యతో బాధపడుతున్నానని తెలిపారు. వెలుతురును చూడడం ఇబ్బందిగా ఉండడం వల్లే కళ్లద్దాలు పెట్టుకుంటున్నట్టు చెప్పారు. దాంతో ఇప్ప‌టికే ఓమారు యాత్ర‌ను మ‌ధ్య‌లో ఆపేశారు. తాజాగా మ‌రో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించిన‌ట్టు తెలుస్తోంది.

ఈ కార‌ణంగానే ప‌వ‌న్ పోరాట యాత్ర గోదావ‌రి జిల్లాల్లో నెలాఖ‌రుకి మారుస్తున్న‌ట్టు తెలుస్తోంది. అప్పట్లో యాత్ర కారణంగా కొన్ని రోజులు వాయిదా వేసుకున్న పవన్ ఎట్టకేలకు ఆపరేషన్ చేయించుకున్నారు. శస్త్ర చికిత్స కారణంగా బస్సు యాత్రకు పవన్ కొంత విరామం ప్రకటించారు. ఈనెల 26 నుంచి తిరిగి యాత్ర ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.






Related News

ఆర్కే ప్ర‌త్య‌ర్థి అత‌డే..!

Spread the loveవ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అన్ని పార్టీలు కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నారు. వ‌చ్చే మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఈసీRead More

జ‌న‌సేనాని..ఓ సారి వెన‌క్కి చూసుకో..!

Spread the loveరాజ‌కీయ మార్పు కోసం అంటూ ముంద‌డుగు వేసిన జ‌న‌సేనానికి అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఏపీలో స‌మీక‌ర‌ణ కోసం ఏరీతినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *