Main Menu

వైసీపీలోకి మ‌రో మాజీ ఎమ్మెల్యే

Spread the love

వైసీపీలోకి మ‌రో మాజీ ఎమ్మెల్యే చేరిక‌కు రంగం సిద్ధం అయ్యింది. ఏపీ రాజ‌ధాని న‌గ‌రంలో ఇదో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్ప‌టికే ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ గూటిలో చేరిపోయారు. గ‌డిచిన రెండేళ్ల‌లో విజ‌య‌వాడ మాజీ ఎమ్మెల్యేలు వెల్లంప‌ల్లి శ్రీనివాస్, మ‌ల్లాది విష్ణు జ‌గ‌న్ గూటిలో చేరారు. ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా ఆపార్టీలో ఉన్నారు. దాంతో ప‌లువురు సీనియ‌ర్లు వైసీపీలో కొన‌సాగుతుండ‌గా తాజాగా మ‌రో మాజీ ఎమ్మెల్యే కూడా జ‌గ‌న్ వైపు దృష్టి సారించారు. ఆయ‌న చేరిక‌కు రంగం సిద్దం చేసుకున్న‌ట్టు చెబుతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంగా య‌ల‌మంచిలి ర‌వి వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డం ఖాయం అంటున్నారు.

ఇప్ప‌టికే వంగ‌వీటి రాధా నేరుగా ర‌వితో చ‌ర్చ‌లు జ‌రిపారు. జ‌గ‌న్ తో కూడా మాట్లాడారు. దాంతో లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టే భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఇప్ప‌టికే న‌గ‌రంలో మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఖాళీ లేవ‌ని భావిస్తున్న త‌రుణంలో ర‌వి వ‌స్తే ఎక్క‌డ అకామిడేట్ చేస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంమే. గ‌తంలో ర‌వి ప్ర‌జారాజ్యం పార్టీ త‌రుపున విజ‌యం సాదించారు. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న ఆయ‌న వైసీపీ గూటిలో చేర‌డం విప‌క్షానికి బ‌లం చేకూర్చే అంశంగా భావిస్తున్నారు. ప్ర‌స్తుతం మాత్రం తూర్పు నుంచి వంగ‌వీటి రాధ‌, సెంట్ర‌ల్ మ‌ల్లాది విష్ణు, వెస్ట్ వెల్లంప‌ల్లి అనే చ‌ర్చ సాగుతోంది. య‌ల‌మంచ‌లి ర‌వికి పెన‌మ‌లూరు కేటాయించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ది ఓ వాద‌న‌. కానీ మ‌రి ర‌వికి ఏం హామీ ద‌క్కిందో చూడాలి.






Related News

ఆంధ్రాలో కేసీఆర్ ప్ర‌చారం ఆ పార్టీ కోస‌మే!

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పాత్ర‌పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. టీఆర్ఎస్ భారీ మెజార్టీకి చంద్ర‌బాబు కార‌ణ‌మంటూ సోష‌ల్Read More

చంద్ర‌బాబు క‌న్ను ఆరాష్ట్రంపై!

Spread the loveఏపీ సీఎం ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల‌లో టీడీపీ నేతృత్వంలో ఓ బృందం వెళ్లిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *