Main Menu

అశోక్ బాబుకి చేదు అనుభ‌వం

Spread the love

ఏపీ ఎన్జీవో నాయ‌కుడు ప‌రుచూరి అశోక్ బాబుకి చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. ఆయ‌న్ని వ్య‌తిరేకిస్తూ ఫ్యాఫ్టో ఉపాధ్యాయ‌సంఘాల ప్ర‌తినిధులు నినాదాలు చేశారు. అశోక్ బాబు ఉప‌న్యాసాన్ని అడ్డుకున్నారు. ఆయ‌న్ని వేదిక మీద‌కు పిల‌వ‌డాన్నే నిర‌సించారు. దాంతో ఫ్యాఫ్టో ఆధ్వ‌ర్యంలో సీపీఎస్ కి వ్య‌తిరేకంగా విజ‌య‌వాడలో సాగుతున్న ఆందోళ‌న ఉద్రిక్తంగా మారింది. ప‌లువురు ఉపాధ్యాయులు అశోక్ బాబు తీరుని తీవ్రంగా నిర‌సించారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి వంత పాడుతూ ఉద్యోగ‌, ఉపాధ్యాయుల‌కు అన్యాయం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. దాంతో చివ‌ర‌కు అశోక్ బాబు ఉప‌న్యాసం ముందుకు సాగ‌లేదు. ఏపీ జేఏసీ నాయ‌కుడి హోదాలో వ‌చ్చిన అశోక్ బాబుకి ఇదో ఘోర అవ‌మానంగా భావిస్తున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ విధానాల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్నందుకు ఉపాద్యాయుల్లో ఉన్న ఆగ్ర‌హాన్ని ఇది ప్ర‌స్ఫుటం చేస్తోంద‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లో టీడీపీలో చేరే అవ‌కాశం ఉంది.ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ఇది చేదు అనుభవంగా భావించాలి.






Related News

ఆంధ్రాలో కేసీఆర్ ప్ర‌చారం ఆ పార్టీ కోస‌మే!

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పాత్ర‌పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. టీఆర్ఎస్ భారీ మెజార్టీకి చంద్ర‌బాబు కార‌ణ‌మంటూ సోష‌ల్Read More

చంద్ర‌బాబు క‌న్ను ఆరాష్ట్రంపై!

Spread the loveఏపీ సీఎం ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల‌లో టీడీపీ నేతృత్వంలో ఓ బృందం వెళ్లిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *