Main Menu

టీడీపీలో త‌ల‌నొప్పులు తెస్తున్న రాజ‌ధాని త‌గాదాలు

Spread the love

అధికార పార్టీకి పెద్ద త‌ల‌నొప్పి త‌యార‌య్యింది. అందులోనూ అది రాజ‌ధాని ప్రాంతంలోనే కావ‌డంతో బాబు అండ్ కో కి మింగుడుప‌డ‌డం లేదు. పార్టీ బ‌లంగా ఉంద‌ని భావిస్తున్న గుంటూరులో కూడా విబేధాల‌తో రోడెక్కే ప‌రిస్థితి రావ‌డంతో అస‌మ్మ‌తి శిబిరం ర‌గిలిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాడికొండ, గుంటూరు పశ్చిమ, మంగళగిరి, మాచర్ల, బాపట్ల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటూ కొన్ని వ‌ర్గాలు పట్టుపడుతున్నాయి.

తాజాగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ద్వితీయ శ్రేణి నాయకులు గుంటూరులో భేటి అయ్యారు. దీనికి జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌ వడ్లమూడి పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూర్ణచంద్రరావు, శ్రావణ్‌కుమార్‌కు చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తూ టిడిపిలో చేరిన శ్రావణ్‌కుమార్‌ 2009లో తాడికొండ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయినా 2014లో గెలిచారు. అయితే ఆయన ఎమ్మెల్యే అయినా కార్యకర్తలు, నాయకులతో జిల్లాస్థాయి అధికారిగానే వ్యవహరిస్తున్నారని ఒక గ్రూపు నాయకులు ఆరోపిస్తున్నారు. శ్రావణ్‌కుమార్‌ తీరుపై టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గల్లా అరుణకుమారి సమక్షంలో గతంలోనే పలుమార్లు అసమ్మతి సమావేశాలు నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాజీ సర్పంచ్‌లు, పలువురు ఎంపిటిసిలు హాజరయ్యారు. శ్రావణ్‌కుమార్‌ అయితే తాడికొండలో టిడిపి గెలవదని, అందువల్ల అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేయాలని తీర్మానించారు. ఈ మేరకు త్వరలో జిల్లా నాయకుల ద్వారా సిఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించారు.

ఇక రావెల నియోజ‌క‌వ‌ర్గంలో కూడా అదే ప‌రిస్థితి. మాజీ మంత్రి ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు నవంబరు 30న టిడిపికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇప్పటి వరకూ దళిత నాయకుడ్ని ఇన్‌ఛార్జిగా ఎంపిక చేయలేకపోయారు. జిల్లాలో దళితులకు రిజర్వు చేసిన నియోజకవర్గాల్లో పరోక్షంగా పెత్తందారీ సామాజిక తరగతుల ఆధిపత్యం కొనసాగుతోంది. జన్మభూమి నిర్వహణ నేపథ్యంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దాసరి రాజా మాస్టారుకు ఇన్‌ఛార్జిగా ప్రొటోకాల్‌ పాటించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియోజకవర్గంలో మొత్తంగా పార్టీ వ్యవహారాలను గల్లా అరుణకుమారి పర్యవేక్షిస్తున్నారు.

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి స్థానంలో మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావుకు అవకాశం ఇవ్వాలని ఇటీవల మంత్రుల సమక్షంలోనే కొంతమంది సమావేశంలో ప్రస్తావించారు. మంగళగిరిలో ఇన్‌ఛార్జి గంజి చిరంజీవి స్థానంలో మరో అభ్యర్ధిని ఎంపిక చేయాలని అధిష్టానానికి జిల్లా నాయకులు ఇప్పటికే నివేదికలు పంపారు. మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు ఇక్కడ అవకాశం ఇస్తారని ప్రచారమవుతోంది. మాచర్ల, బాపట్ల నియోజకవర్గాల్లోనూ ఇన్‌ఛార్జులు కొమ్మారెడ్డి చలమారెడ్ది, అన్నం సతీష్‌ ప్రభాకర్‌ (ఎమ్మెల్సీ) స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసేందుకు పార్టీ అధిష్టానం ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించింది. వీరితో పాటు జిల్లాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తిపైనా పార్టీ అధిష్టానం వివిధ రూపాల్లో సర్వే చేయిస్తోంది. దాంతో ఎన్నిక‌ల నాటికి ఈ వేడి మ‌రింతం రాజుకోవ‌డం ఖాయంగా ఉంది. దాంతో టీడీపీ అధిష్టానానికి పెద్ద త‌ల‌నొప్పి గా తయార‌వుతోంది.


Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the loveఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *