Main Menu

క‌మ‌లంలో క‌ల‌క‌లం

Spread the love

ఏపీ బీజేపీలో క‌ల‌క‌లం రేగుతోంది. ప‌ద‌వుల పంపిణీలో వ్య‌వ‌హారం వివాదాస్ప‌దంగా మారుతోంది. ఇటీవ‌ల రాష్ట్ర స్థాయిలో కార్య‌వ‌ర్గ నియామ‌కాల్లో కీల‌క ప‌దవుల కేటాయింపు జ‌రిగింది. అందులో భాగంగా సీనియ‌ర్ల‌కు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. అదే ఇప్పుడు సీనియ‌ర్ల‌కు చిర్రెత్తు కొస్తోంది. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వులు కేటాయింపుల్లో జ‌రిగిన అన్యాయంపై ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్ర , రాయ‌ల‌సీమ నేత‌లు గుర్రుగా ఉన్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. గ‌తంలో ఉమ్మ‌డి ఆంధ్రాలోనూ, ప్ర‌స్తుత క‌మిటీలోనూ సురేష్ రెడ్డి, కిషోర్ వంటి వారికే ప్రాధాన్యం ద‌క్క‌డం చాలామందికి గిట్ట‌డం లేదు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర వారికి చోటే లేద‌న‌డం విస్మ‌య‌క‌రంగా మారింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

అదే స‌మ‌యంలో ఎస్సీ, బీసీల‌కు కూడా కార్య‌వ‌ర్గంలో ప్రాధాన్యం ద‌క్క‌లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దాంతో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను టార్గెట్ చేసుకుని ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు క‌మ‌లంలో క‌ల‌క‌లం రేపుతోంది. తీవ్ర స‌మ‌స్య‌లు సృష్టించేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే నేదురుమిల్లి రాంకుమార్ రెడ్డి వంటి వారికి ప‌ద‌వి కేటాయించినా , ఆయ‌న పార్టీ మారబోతున్న స‌మ‌యంలో త‌క్ష‌ణం క‌మిటీని విస్త‌రించి ఇలాంటి ప‌ద‌వుల త‌గాదాల‌ స‌మ‌స్య‌ను స‌ర్థుబాటు చేసే యోచ‌న‌లో క‌మ‌ల‌నాధులున్న‌ట్టు తెలుస్తోంది.






Related News

అమరావతిలో మళ్లీ లీకులు

Spread the love ఏపీ రాజధాని అమరావతిలో లీకుల పర్వం సాగుతోంది. గతంలో ప్రతిపక్ష నేత ఛాంబర్ లో లీకులొచ్చాయి.Read More

జోరు పెంచిన టీడీపీ!

Spread the loveటీడీపీ వ్యూహం మార్చింది. రాజ‌కీయంగా మ‌నుగ‌డ సాగించాలంటే మీడియాలో కొత్త పంథా అవ‌స‌రం అని గ్ర‌హించింది. దానికిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *