టీడీపీకి కొత్త తలనొప్పి, నేతల రాజీనామా

TDP-flags-AFP
Spread the love

తెలుగుదేశం పార్టీలో తగాదాలు ముదురుతున్నాయి. తీవ్రమవుతున్నాయి. తాజాగా నూజివీడు టీడీపీలో వివాదం తారస్థాయికి చేరింది. పదవుల పంపిణీ వ్యవహారం టీడీపీలో ముసలలానికి దారితీసింది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి కోసం గత కొంతకాలంగా రెండు గ్రూపుల మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది.తాజాగా ఆ పదవిని ఎంపీ మాగంటి బాబు వర్గానికి ఓకే అయ్యింది. దాంతో ఒక్కసారిగా వ్యతిరేకవర్గం భగ్గుమంది. తీవ్ర ఆగ్రహంతో తాజాగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్గీయులు అత్యవసరం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. వాడివేడిగా సమావేశం సాగింది. ఎంపీ మాగంటి బాబు తీరుపై పలువురు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. తమ రాజీనామా లేఖలను ముద్దరబోయినకు అందించారు. సీఎం చంద్రబాబు పేరుతో రాసిన రాజీనామా లేఖలను కార్యకర్తలంతా తమ నేతకు అందించారు

దాంతో తెలుగుదేశం నేతల్లో గుబులు పట్టుకుంది. అసలే పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న సమయంలో విబేధాలు పార్టీని బజారునపడేస్తున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. జిల్లా టీడీపీ నేతలు రంగంలో దిగారు. బుజ్జగింపుల పర్వం ప్రారంభించారు. అయితే రాజీనామా చేసిన నేతలు మాత్రం ముద్దరబోయిన మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. అధిష్టానం మాటలు విని రాజీపడితే సహించేది లేదంటున్నారు. దాంతో వ్యవహారం ఎటుదారితీస్తుందనే చర్చ మొదలయ్యింది.


Related News

RP-Sisodia

ఏపీకి కొత్త ఎన్నికల అధికారి

Spread the love1Shareఏపీలో ఎన్నికలంటే భన్వర్ లాల్ పేరు అందరికీ సుపరిచితం. ఉభయ రాష్ట్రాల్లోనూ ఆయన సుదీర్ఘకాలం ఎన్నికల సంఘంRead More

pawan-mahesh kathi-colalge

కత్తి మహేష్ దే పై చేయి

Spread the love18Sharesతాజాగా కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వ్యవహారంలో పవర్ స్టార్ పై సినీ క్రిటిక్ పైRead More

 • దుమారం రేపేలా ఉన్న బాబుకి కలెక్టర్ల లేఖ
 • మంత్రి నారాయణపై అధికారుల గుస్సా
 • కొత్త పోలీస్ బాస్ కూడా కొన్నాళ్లకే…
 • సీఎంకి ఛాన్స్ లేదు: విజయసాయికి ఎలా?
 • చంద్రబాబు మీద కత్తి
 • చంద్రబాబుకి థాంక్స్ చెప్పిన జగన్
 • నారా లోకేష్ కి అవార్డ్
 • పెనమలూరు ఎమ్మెల్యేపై దాడి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *