Main Menu

సెంటిమెంట్: దేవినేని ఉమాకి ఓట‌మి త‌ప్ప‌దా?

Spread the love

సెలబ్రిటీల సెంటిమెంట్లు చిన్న‌వేం కాదు. రాజ‌కీయాల్లో ఇవి మ‌రీ ఎక్కువ‌గా ఉంటాయి. దాంతో త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న సెంటిమెంట్స్ పై నేత‌లు మ‌ధ‌న ప‌డుతూ ఉంటారు. స‌రిగ్గా ఇప్పుడు అలాంటి ప‌రిస్థితే దేవినేని ఉమామ‌హేశ్వ‌ర రావుని వేధిస్తోంది. ఏపీ ఇరిగేష‌న్ మంత్రిగా నాలుగున్న‌రేళ్లుగా చ‌క్రం తిప్పుతున్న ఉమాని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విష‌యం తెలిస్తే మీరు సైతం ఆశ్చ‌ర్య‌పోతారు.

కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో ఉన్న ఈ ప్ర‌త్యేక‌త ఇప్పుడు మ‌ళ్లీ పున‌రావృతం కావ‌చ్చ‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే మంత్రిగా ప‌నిచేసిన కామినేని శ్రీనివాస్ రావు రాజ‌కీయంగా అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. పోటీకి దూరంగా ఉండ‌బోతున్నట్టు ప్ర‌క‌టించేశారు. దాంతో ఓమారు అమాత్య హోదా అనుభ‌వించిన కృష్ణా జిల్లా వాసికి ఆ త‌ర్వాత రాజ‌కీయంగా చిక్కులు ఉంటాయ‌న్న విష‌యం కామినేని విష‌యంలో క‌నిపిస్తోంది. అంతకుముందు 1985లో ఎన్టీఆర్ మంత్రివ‌ర్గంలో ప‌నిచేసిన‌ వ‌సంత నాగేశ్వ‌ర‌రావు. ఎర్నేని సీతాదేవి మంత్రులుగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత వారి రాజ‌కీయ భ‌విత‌వ్యం క‌ష్టంగా మారింది. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందారు 1989లో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రులుగా ప‌నిచేసిన ముక్క‌పాటి వెంక‌టేశ్వ‌ర రావు, కోనేరు రంగారావు కూడా 1994 ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌య్యారు. పేర్ని కృష్ణ‌మూర్తికి అలాంటి చేదు ఫ‌లితాలు త‌ప్ప‌లేదు. 1994లో ఎన్టీఆర్ హ‌యంలో మంత్రి ప‌ద‌వి స్వీక‌రించిన దేవినేని రాజ‌శేఖ‌ర్ కూడా టీడీపీలో చీలిక త‌ర్వాత ప‌ద‌విని కోల్పోయారు. 1999లో మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ ప్ర‌మాద‌వ‌శాత్తూ ప్రాణాలు కోల్పోగా, మ‌రో మంత్రి వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర రావు ఓడిపోవ‌డం విశేషం. అదే స‌మ‌యంలో ఇప్ప‌టి మంత్రి కొల్లి ర‌వీంద్ర సొంత మామ న‌ర‌సింహ‌రావు కూడా మ‌ర‌ణించారు.

2004 ఎన్నిక‌ల్లో గెలిచి వైఎస్ హ‌యంలో మంత్రులుగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ముగ్గురు నేత‌లు ఆ త‌ర్వాత 2009లో ప‌రాజ‌యం పాల‌య్యారు. ఆ జాబితాలో కోనేరు రంగారావు, పిన్న‌మ‌నేని వెంక‌టేశ్వ‌ర రావుతో పాటు మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ ఉన్నారు. ఇక 2009లో మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన పార్థ‌సార‌ధి కూడా మొన్న‌టి ఎన్నిక‌ల్లో మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంట్ సీటు నుంచి ఓడిపోయారు. దాంతో మంత్రులుగా ప‌నిచేసిన కృష్ణా జిల్లా వాసుల‌కు వెంట‌నే క‌ష్టాలు పొంచి ఉంటాయ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ఈ జాబితాలో కోనేరు రంగారావు 1994లో ఓడిపోయిన నాటి మంత్రి కోనేరు రంగారావు 2004లో గెలిచి మ‌ళ్లీ మంత్రి వ‌ర్గంలోకి వ‌చ్చారు. దేవినేని నెహ్రూ కూడా అదే రీతిలో విజ‌యం సాధించారు. మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ కూడా 2009లో ఓట‌మి పాల‌యిన‌ప్ప‌టికీ 2014లో మ‌ళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టి డిప్యూటీ స్పీక‌ర్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

దాంతో ఇప్పుడు మంత్రులుగా ఉన్న దేవినేని ఉమా, కొల్లి ర‌వీంద్ర‌పై అంద‌రి దృష్టి ప‌డింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారి భ‌విత‌వ్యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు మంత్రులు గ‌ట్టి పోటీదారుల‌ను ఢీ కొట్ట‌బోతున్నారు. మైల‌వ‌రంలో వైసీపీ వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ని రంగంలో దింప‌డంతో టీడీపీకి చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఇక బంద‌రులో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఇటీవ‌ల చేసిన పోరాటాల‌తో మ‌ళ్లీ ప్ర‌జాద‌ర‌ణ పొందాల‌ని చూస్తున్నారు. దాంతో ఇద్ద‌రు మంత్రులు గ‌ట్టి ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కోవాల్సిన స‌మ‌యంలో ఈ సెంటిమెంట్ వారిని మ‌రింత క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ఎలాంటి క‌ష్టాన్ని తెస్తుందోన‌నే చ‌ర్చ సాగుతోంది.


Related News

ఏపీలో ఒంట‌రి జ‌గ‌న్!

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో వైఎస్ జ‌గ‌న్ ఒంట‌రి అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఏకాకిగా మిగిలిన బీజేపీకి ఆయ‌న మాత్ర‌మేRead More

మైల‌వ‌రంలో ప‌రువు పోయింది..!

Spread the loveకృష్ణా జిల్లాలో కీల‌క‌మైన మైల‌వ‌రం ప‌రిణామాలు ఇప్పుడు ఆస‌క్తిగా మారుతున్నాయి. తాజాగా వ‌సంత‌కృష్ణ ప్ర‌సాద్ మీద పెట్టినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *