పురందేశ్వరి పోటీ ఎక్కడ?

ఏపీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సంక్రాంతి తర్వాత మరింత జోరుగా మార్పులు, చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు సతీ సమేతంగా వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రచారానికి తోడుగా తాజాగా ఈ వ్యవహారం ఖాయం అయ్యింది.
సంక్రాంతి సందర్భంగా వాడవాడలా పర్చూరు లో దగ్గుబాటి వారసుడి ఫోటోలతో వైసీపీ అభ్యర్థిగా ప్రారంభమయిన ప్రచారం దానికి నిదర్శనంగా కనిపిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, ఏపీలో మంత్రిగానూ, ఎన్టీఆర్ హయంలో కీలక నేతగా వ్యవహరించిన వెంకటేశ్వర రావు ల ఏకైక కుమారుడు హితేశ్ చెంచురామ్ వచ్చే ఎన్నికల్లో తమ సొంత నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయినట్టు స్పష్టమయ్యింది.
ఎన్టీఆర్ పెద్దల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. టీడీపీని వీడి 2004లో భార్యతోపాటు కాంగ్రె్‌సలో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలుపొందగా.. పురందేశ్వరి బాపట్ల, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గాల నుంచి విజయం సాధించి యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల నుంచి దగ్గుబాటి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.
అనంతరం పురందేశ్వరి బీజేపీలో చేరి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది నుంచి దగ్గుబాటిని పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కుమారుడికి పర్చూరు అసెంబ్లీ సీటుతోపాటు, పురందేశ్వరికి కోరుకున్న లోక్‌సభ టికెట్ ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపినట్లు తెలిసింది. అయితే పురందేశ్వరి పుత్రుడి సీటు ఖాయం అయిన తరుణంలో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం తేలాల్సి ఉంది.
Related News

ఏపీలో ఒంటరి జగన్!
Spread the loveఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ ఒంటరి అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఏకాకిగా మిగిలిన బీజేపీకి ఆయన మాత్రమేRead More

మైలవరంలో పరువు పోయింది..!
Spread the loveకృష్ణా జిల్లాలో కీలకమైన మైలవరం పరిణామాలు ఇప్పుడు ఆసక్తిగా మారుతున్నాయి. తాజాగా వసంతకృష్ణ ప్రసాద్ మీద పెట్టినRead More