Main Menu

అమ‌రావ‌తి అవినీతిపై మ‌రో పుస్త‌కం

cbn-1523619854
Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని వ్య‌వ‌హారం మ‌రోసారి క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే ఐవైఆర్ కృష్ణారావు సంచ‌ల‌నం రేప‌గా, తాజాగా ఆయ‌న స‌ర‌స‌న మ‌రో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేరిపోయారు. ఈసారి చంద్ర‌బాబు స‌న్నిహితుడిగా గుర్తింపు పొందిన అజ‌య్ క‌ల్లాం చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, రాజధాని నిర్మాణం పేరుతో భారీ ఎత్తున డబ్బులు వృధా చేస్తున్నారని కల్లాం ఆరోపించారు. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా అమ‌రావ‌తి వ్య‌వ‌హారాల‌పై తానో పుస్త‌కం రాయ‌బోతున్న‌ట్టు అజ‌య్ క‌ల్లం ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిగా మారింది.

చంద్ర‌బాబు పాల‌నాతీరుని అజయ్ క‌ల్లాం త‌ప్పుబ‌ట్టారు. అభివృద్ధి కేంద్రీక‌ర‌ణ స‌రికాద‌న్నారు. విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం నగరాలకు పరిపాలనను విస్తరించాల‌ని డిమాండ్ చేశారు. ఏపీ కొత్త రాష్ట్రంగా ఏర్ప‌డిన‌ప్ప‌టికీ ప్రజలకు మంచి జరగకపోగా పాలకుల అవినీతి చాలా పెరిగిపోయిందని ఆరోపించారు. ఏపీలో కొత్త రాజధాని కట్టాలనుకునేది కేవలం పైరవీల కోసం మాత్రమే అన్న‌ట్టుగా క‌నిపిస్తోందంటూ సంచ‌ల‌నం రేపారు. . రాజధాని పేరుతో భారీగా డబ్బును దుబారా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

అంత‌టితో స‌రిపెట్ట‌కుండా సినీ పొలిటీషియ‌న్స్ అంటూ ప‌రోక్షంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద కూడా కామెంట్స్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. మేక‌ప్ వేసుకున్న కొందరు రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని అజయ్ క‌ల్లాం ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో ప్ర‌శ్నించే త‌త్వం యువ‌త‌లో పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.






Related News

pawan

జ‌న‌సేనానికి కంటి స‌మ‌స్య‌లు

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయ‌న్ని కంటి స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికేRead More

Chandu Sambasiva Rao2

ప‌ర‌కాల ప్లేస్ లో ఆయ‌నేనా..?

Spread the loveచంద్ర‌బాబుకి పెద్ద చిక్కొచ్చింది. ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తుండ‌డంతో చాలామంది నేత‌లు ప్ర‌త్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ప‌ద‌వుల పంపిణీలో త‌గినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *