Main Menu

ప‌ర‌కాల ప్లేస్ లో ఆయ‌నేనా..?

Spread the love

చంద్ర‌బాబుకి పెద్ద చిక్కొచ్చింది. ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తుండ‌డంతో చాలామంది నేత‌లు ప్ర‌త్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ప‌ద‌వుల పంపిణీలో త‌గిన న్యాయం జ‌ర‌గ‌లేద‌ని భావిస్తే చాలు ఫిరాయించ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. ఇప్పుడు అలాంటి జాబితాలో పెద్ద మ‌నుషులుగా భావిస్తున్న నేత‌లు కూడా ఉన్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీలు అమ‌లుకాక‌పోవ‌డం, త‌మ‌కు త‌గిన గుర్తింపు రాక‌పోవ‌డంతో కొంద‌రు నేత‌లు టీడీపీకి హ్యాండిచ్చే ఆలోచ‌న‌తో ఉన్నారు. అలాంటి జాబితాలో చందు సాంబ‌శివ‌రావు పేరు కూడా వినిపిస్తోంది. ఉన్న‌త విద్యావంతుడైన చందు సాంబ‌శివ‌రావు మంచి విశ్లేష‌కుడిగా గుర్తింపు ఉంది. టీడీపీ వ్య‌వ‌హారాల్లో కీల‌కంగా ప‌నిచేస్తున్నారు. అయినా త‌న‌కు త‌గిన గుర్తింపు ద‌క్క‌డం లేద‌న్న ఆవేద‌న ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న ఇటీవ‌ల జ‌న‌సేన శిబిరం వైపు చూస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

అదే స‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారు ప‌ద‌వి నుంచి ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ రాజీనామా చేయ‌డంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. వాస్త‌వానికి ప‌ర‌కాల రాజీనామా ఉప‌సంహ‌రించుకోవాల‌ని టీడీపీ నుంచి అనేక సార్లు కోరినా ఆయ‌న అంగీక‌రించ‌లేద‌ని స‌మాచారం. దాంతో ఇక ప‌ర‌కాల ప్లేస్ లో చందు సాంబ‌శివ‌రావు నియామ‌కం ఖాయం అనే ప్ర‌చారం ఊపందుకుంది. కాపుల‌కు ప్రాధాన్య‌త పెంచ‌డంలో భాగంగా ఇప్ప‌టికే ఖాళీగా ఉన్న ఒక క్యాబినెట్ బెర్త్ ను ఆ సామాజిక‌వ‌ర్గానికి కేటాయించే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నారు. ఇక మీడియా స‌ల‌హాదారు ప‌ద‌విని కూడా వారికే కేటాయించాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే చందు సాంబ‌శివ‌రావు త‌గిన వ్య‌క్తిగా ప‌లువురు భావిస్తున్నారు. ఆయ‌న నియామ‌కం ప‌ట్ల పెద్దగా అభ్యంత‌రాలు కూడా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స‌మాచారం. దాంతో ఎట్ట‌కేల‌కు చందుకి ప‌ద‌వీయోగం ఖాయం అన్న వాద‌న వినిపిస్తోంది.






Related News

టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన మునిసిప‌ల్ వ్య‌వ‌హారం

Spread the loveగుంటూరు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు గ‌రం గ‌రం అవుతున్నాయి. మునిసిపల్ రాజ‌కీయాలు పార్టీలో మంట‌లు రేపుతున్నాయి. జిల్లాలోనిRead More

రోజా వాద‌న‌ను అంగీక‌రించిన కోర్ట్

Spread the love13Sharesవైసీపీ ఎమ్మెల్యే రోజా ఎట్ట‌కేల‌కు న్యాయ‌స్థానంలో ఊర‌ట సాధించారు. ఆమె న్యాయ పోరాటం ఫ‌లించింది. టీడీపీ ఎమ్మెల్యేపైRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *