Main Menu

ఆ వీడియోని త‌ప్పుబ‌ట్టిన చంద్ర‌బాబు

Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబు స్పందించారు. వైర‌ల్ అయిన వీడియో క్లిప్ పై నోరు మెదిపారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటంపై కుట్ర సాగుతోంద‌ని వాపోయారు. తాజాగా టెలీ కాన్ష‌రెన్స్ లో మాట్లాడిన ఆయ‌న ముర‌ళీమోహ‌న్ వ్యాఖ్య‌ల‌ను వీడియోలో క‌ట్ అండ్ పేస్ట్ చేశారంటూ వ్యాఖ్యానించారు. విభజన హామీలు నెరవేర్చేలా కేంద్రంపై టీడీపీ చేస్తున్న పోరాటాల చుట్టూ కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. త‌ప్పుడు ప్ర‌చారాల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.

ఎంపీల‌తో మాట్లాడిన సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు వారికి ప‌లు సూచ‌న‌లు చేశారు. అంద‌రూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని గుర్తు చేశారు. ప్ర‌జ‌ల‌ కోసం జరుగుతున్న పోరాటానికి తూట్లు పొడిచే కుట్రల ప‌ట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కుట్రదారుల చేతిలో ఎంపీలు పావులుగా మారకూడదని సూచించారు. ఏమరపాటుగా వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రమూ తగదన్నారు.

ఎంపీలు అవంతి శ్రీనివాస్, ముర‌ళీమోహ‌న్ కూడా అదే రీతిలో త‌మ వ్యాఖ్యల‌ను వ‌క్రీకరించార‌ని చెప్పుకురావ‌డం విశేషం. చంద్ర‌బాబు మాట‌ల ప్ర‌కారం ఎంపీలు కుట్ర‌లో భాగం కావ‌ద్ద‌ని చెప్ప‌డం ద్వారా, స‌ద‌రు వీడియోను ప‌బ్లిక్ చేసిన త‌న పార్టీకే చెందిన ఎంపీ పాత్ర‌ను గుర్తు చేసిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని ప‌లువురు అనుమానిస్తున్నారు. క‌ట్ అండ్ పేస్ట్ వ్యాఖ్య‌లయితే త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల్సింది పోయి. సూచ‌న‌లు చేయ‌డం విచిత్రంగా ఉంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.






Related News

టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన మునిసిప‌ల్ వ్య‌వ‌హారం

Spread the loveగుంటూరు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు గ‌రం గ‌రం అవుతున్నాయి. మునిసిపల్ రాజ‌కీయాలు పార్టీలో మంట‌లు రేపుతున్నాయి. జిల్లాలోనిRead More

రోజా వాద‌న‌ను అంగీక‌రించిన కోర్ట్

Spread the love13Sharesవైసీపీ ఎమ్మెల్యే రోజా ఎట్ట‌కేల‌కు న్యాయ‌స్థానంలో ఊర‌ట సాధించారు. ఆమె న్యాయ పోరాటం ఫ‌లించింది. టీడీపీ ఎమ్మెల్యేపైRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *