Main Menu

జ‌గ‌న్ బ‌లంపై బాబు దెబ్బ కొట్టేనా?

Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ప్ర‌చారం ఉధృతం చేస్తున్నారు. అధికార కార్య‌క్ర‌మాల‌తో పార్టీ వ్య‌వ‌హారాల‌ను మిళితం చేసి ప‌చ్చ‌దండు ప్ర‌చారానికి అడ్డు లేకుండా చేస్తున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల స‌న్నాహాల్లో ముందున్న‌ట్టు క‌నిపిస్తోంది. అ నేప‌థ్యంలో సామాజిక స‌మీక‌ర‌ణాలే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు సాగుతున్నారు.

ముఖ్యంగా గ‌డిచిన ఎన్నిక‌ల్లో త‌న‌కు మింగుడుప‌డ‌ని మైనార్టీలు, ఎస్సీల ఓట్ల‌పై బాబు కేంద్రీక‌రించారు. జ‌గ‌న్ కి గుండ‌గుత్తుగా ప‌డిన ఓట్ల‌లో చీలిక కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌ద్వారా జ‌గ‌న్ ఓట్ బ్యాంక్ ని దెబ్బ‌కొట్టే య‌త్నంలో ఉన్నారు. అందులో భాగంగానే ఇప్ప‌టికే ఎస్సీల స‌మ‌స్య‌పై కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన చంద్ర‌బాబు తాజాగా మైనార్టీల‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

గ‌డిచిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఒక్క సీటు మాత్ర‌మే మైనార్టీల‌కు కేటాయించారు. అది కూడా మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు, ప్ర‌స్తుతం టీడీపీ నేత కిషోర్ కుమార్ రెడ్డిపై పీలేరులో బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థిని బ‌రిలో దింపాల‌న్న ల‌క్ష్యంతోనే మైనార్టీని నిల‌బెట్టిన‌ట్టు విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. అయినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం మైనార్టీల‌కు సీట్లు పెంచుతామ‌ని, త్వ‌ర‌లోనే క్యాబినెట్ లో చోటు క‌ల్పిస్తామ‌ని , వ‌చ్చే బ‌డ్జెట్ లో మైనార్టీల‌కు నిధులు కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ మైనార్టీల‌ను ప్ర‌సన్నం చేసుకోవ‌డంలో చంద్ర‌బాబు కి ప‌లు స‌మ‌స్య‌లున్నాయి. వైసీపీ, జ‌న‌సేన‌కు ఓట్లేసినా అవి బీజేపీకి వేసిన‌ట్టేన‌ని ప్ర‌క‌టించారు. అయినా నాలుగు నెల‌ల క్రితం వ‌ర‌కూ కాషాయ కూట‌మిలో ఉండి, దేశ‌వ్యాప్తంగా మైనార్టీల‌పై దాడులు సాగుతున్న‌ప్పుడు క‌నీసం మాట మాత్రం స్పందించ‌ని చంద్ర‌బాబుని మైనార్టీలు విశ్వ‌సించే అవ‌కాశాలు స్వ‌ల్పంగానే క‌నిపిస్తున్నాయి.

అదే స‌మ‌యంలో ఏపీలో వ‌క్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం, మైనార్టీల సంక్షేమం వంటి విష‌యాల్లో చంద్ర‌బాబు స‌ర్కారు ధోర‌ణి మైనార్టీ యువ‌త‌లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మవుతోంది. వాటిని చ‌ల్లార్చేందుకు చంద్ర‌బాబు చాలా ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ నేరుగా సీఎం స‌భ‌లోనే ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నిస్తే మైనార్టీ ఓట్ బ్యాంక్ విష‌యంలో బాబు ఎత్తులు ఏమేర‌కు ప‌లిస్తాయ‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అయినా జ‌గ‌న్ ఖాతాలో ప‌డాల్సిన ఓట్ల‌ను ఏమేర‌కు చీల్చినా అది త‌మ‌కే ల‌బ్ధి చేకూరుస్తుంద‌నే ధోర‌ణిలో టీడీపీ నాయ‌క‌త్వం ప్ర‌య‌త్నిస్తోంది. ఫ‌లితాలు ఎలా ఉంటాయో చూడాలి.


Related News

రీపోలింగ్ త‌ప్ప‌లేదు..

Spread the loveఏపీ ఎన్నిక‌ల్లో రీపోలింగ్ త‌ప్ప‌లేదు. రాష్ట్రంలోని మూడు జిల్లాల ప‌రిధిలో రీపోలింగ్ కి ఈసీ నిర్ణ‌యం తీసుకుంది.Read More

వైసీపీకి ఎదురుదెబ్బ‌!

Spread the loveగ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ట్టిగా పోరాడినా చివ‌రిలో చ‌తికిల‌ప‌డింది. ఈసారి అలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాకూడ‌ద‌ని ఆశిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *