Main Menu

పాపం..వంగ‌వీటి..!

Spread the love

వంగ‌వీటి వంశోద్ధార‌కుడుని మ‌ళ్లీ ఉసూరు మ‌నిపించారు. ఆయ‌న ఆశ‌లు నీరుగార్చేశారు. దాంతో వైసీపీని వీడి టీడీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న వంగ‌వీటి రాధాకృష్ణ భ‌విత‌వ్యం గంద‌ర‌గోళంగా మారిపోయింది. ముఖ్యంగా విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటుని ఆశించి వైసీపీని వీడిన వంగ‌వీటి రాధాకి ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చిన‌ట్టు ప్రచారం సాగింది. దానికి త‌గ్గ‌ట్టుగానే రాధా సైకిల్ ప‌య‌నానికి సిద్ధ‌మ‌య్యారు. త‌న తండ్రి మ‌ర‌ణానికి సంబంధించిన విష‌యంలో కూడా చంద్ర‌బాబు కి క్లీన్ చీట్ ఇచ్చేందుకు సాహ‌సించారు.

అన్నీ జ‌రిగినా చివ‌ర‌కు వంగ‌వీటి రాధ‌కు మొండిచేయి త‌ప్ప‌లేదు. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ బెర్త్ ద‌క్క‌లేదు. మొత్తం 7 స్థానాల‌కు గానూ టీడీపీ అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు మాజీ ఎన్జీవో నేత అశోక్ బాబుకిచ్చిన ప్రాధాన్య‌త కూడా వంగ‌వీటి రాధాకి ఇవ్వ‌లేదు. దాంతో లిస్టులో రాధా పేరు క‌నిపించ‌క‌పోవ‌డం ఆయ‌న అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. టీడీపీలో ఎంతో ఆశ‌లు పెట్టుకున్న‌ప్ప‌టికీ ఆఖ‌రికి నిరాశ ఎదుర‌య్యింద‌నే అభిప్రాయానికి వ‌చ్చిన రాధా అనుచ‌రులు ఎటూ పాలుపోని సందిగ్ధం లో ప‌డ్డారు.

టీడీపీ నుంచి ఎమ్మెల్యే సీటు కేటాయించే అవ‌కాశం లేదు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ బెర్తులు ఖాయం అయిపోయాయి. దాంతో రెంటికీ చెడ్డ రేవ‌డిలా మారార‌నే అనుమానం బ‌ల‌ప‌డుతోంది. అయ్యో వంగ‌వీటి రాధా అని వ్యాఖ్యానించే వారు పెరుగుతున్నారు. వైసీపీలో ఆయ‌న‌కు బంద‌రు ఎంపీ టికెట్ గానీ, విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే సీటు గానీ ఆఫ‌ర్ చేశారు. అయితే ఆయ‌న మాత్రం త‌న‌కు సెంట్ర‌ల్ సీటు కావాల‌ని అల‌క‌బూని ఆఖ‌రికి జ‌గ‌న్ కి గుడ్ బై కొట్టేశారు. తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేశారు. కానీ తాజాగా త‌న‌ను న‌మ్ముకున్న బీసీ నేత జంగా కృష్ణ‌మూర్తికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి జ‌గ‌న్ ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోగా, చంద్ర‌బాబు మాత్రం దానికి భిన్నంగా వంగ‌వీటి రాధాని ఇక్క‌ట్ల‌లోకి నెట్టే ప‌రిస్థితి తీసుకొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. చంద్ర‌బాబుని న‌మ్ముకుని జ‌గ‌న్ కి దూర‌మ‌యిన రాధా కి ఇక మిగిలింది జ‌న‌సేన మాత్ర‌మే అన్న‌ట్టుగా త‌యార‌య్యింది.






Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the loveఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *