Main Menu

ఒత్తిడిలో చంద్ర‌బాబు..

Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబు సందిగ్ధంలో ప‌డుతున్నారు. సామాజిక స‌మీక‌ర‌ణాల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. మూడు సీట్ల‌కు జ‌రుగుతున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో మూడో స్థానం విష‌యంలో ఆయ‌న వెనుకా ముందూ చూస్తున్నారు. ప్ర‌స్తుతం వైసీపీకి స‌రిగ్గా కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ ఉంది. అందులో ఒక‌రో ఇద్ద‌రో చేజారితే మూడో సీటు కూడా టీడీపీ ఖాతాలో ప‌డుతుంది. దానికి భిన్నంగా 44మంది ఎమ్మెల్యేలు నిల‌క‌డ‌గా ఉంటే మాత్రం టీడీపీ ఆశ‌లు నెర‌వేర‌వు. దాంతో ఏం చేయాలో పాలుపోని సందిగ్ధం టీడీపీ అధినేత‌కు ఏర్ప‌డింది. ఒక‌వేళ సాహ‌సం చేసి పోటీకి దిగితే ప‌రాజ‌యం ఎదుర‌యితే మాత్రం అది రాజ‌కీయంగా ప్ర‌భావం చూపుతుంది. విజ‌యం ద‌క్కితే అది మంచి బూస్ట్ లా మారుతుంద‌న‌డం కూడా నిస్సందేహం. దాంతో సాహ‌సం చేయాలా..సైలెంట్ కావాలా అన్న‌ది తేల్చుకోలేక‌పోతున్నారు. అందులోనూ వైసీపీ బ‌ల‌మైన అభ్య‌ర్థిని సిద్దం చేయ‌డంతో ఆర్థికంగా స్థిరంగా క‌నిపిస్తోంది.

అదే స‌మ‌యంలో అభ్య‌ర్థుల ఎంపిక విష‌యం కూడా చంద్ర‌బాబుకి స‌మ‌స్య‌గా మారింది. ముఖ్యంగా సామాజిక స‌మీక‌ర‌ణాలు కీల‌కంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ సీఎం ర‌మేష్ త‌న‌కు మ‌రో ఛాన్స్ కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ర‌మేష్ కొన‌సాగింపు కోసం ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ బ‌లంగా ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఒక సీటు సీఎం ర‌మేష్ కి ఖాయంగా కొంద‌రు భావిస్తున్నారు. అదే జ‌రిగితే రెండో సీటు ఎవ‌రికి ద‌క్కుతుంద‌నేది ఉత్కంఠ‌గా మారింది. బీసీ కోటాలో సీనియ‌ర్ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు చివ‌రి ఆశ‌తో క‌నిపిస్తున్నారు. ఇప్పుడు కాక‌పోతే త‌న‌కు ఇంకెప్పుడ‌న్న‌ట్టుగా ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. దాంతో సీమ నుంచి సీఎం ర‌మేష్ కి, కోస్తా నుంచి బీసీ కోటాలో య‌న‌మ‌ల‌కు అవ‌కాశం ఉంటుంద‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి. అయితే య‌న‌మ‌ల త‌న‌కు అవ‌స‌రం అని చంద్ర‌బాబు భావిస్తే మాత్రం బీరా ర‌విచంద్ర‌యాద‌వ్ పేరు తెర‌మీద‌కు వస్తుంద‌ని అంటున్నారు

అదే స‌మ‌యంలో ఎస్సీ మాదిగ కోటాలో అవ‌కాశం కోసం వ‌ర్ల రామ‌య్య కూడా కొండంత ఆశ‌తో ఉన్నారు. పామ‌ర్రు నుంచి వచ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు అవ‌కాశం ఉండ‌డం లేదు. ఉప్పులేటి క‌ల్ప‌న పోటీకి దిగుతుండ‌డంతో వ‌ర్ల రామ‌య్య‌కు రాజ్య‌స‌భ సీటు ఇచ్చి పంపిస్తార‌నే అభిప్రాయం ఉంది. అదే జ‌రిగితే సీఎం ర‌మేష్ ప‌రిస్థితి ఏమిట‌నే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. ఇక వారికితోడుగా రిల‌యెన్స్ సంస్థ‌కు చెందిన మాధ‌వ్ పేరు కూడా బ‌లంగా వినిపిస్తోంది. ఇటీవ‌ల ముఖేష్ అంబానీ అమరావ‌తి వ‌చ్చి చ‌ర్చ‌లు జ‌రిపిన నేప‌థ్యంలో కార్పోరేట్ కోటా ఖాయంగా భావిస్తున్నారు. అదే జ‌రిగితే లెక్క‌ల‌న్నీ తారుమార‌వుతాయి. ఇక మూడో సీటుకి అభ్య‌ర్థిని దింపాల‌నుకుంటే మాత్రం వైసీపీ నుంచి పార్టీలో చేర‌డానికి సిద్ధంగా ఉన్న సునీల్ కి అవ‌కాశం ఇస్తార‌ని అంటున్నారు. ఆయ‌న ససేమీరా అంటున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న స్థానంలో మూడో అభ్య‌ర్థిగా ఎవ‌రిని రంగంలో దింపుతారో చూడాల్సి ఉంది. రెడ్డి సామాజిక‌వ‌ర్గం నుంచి ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం. వీరుగాక జ‌న‌సేన అధినేత సిఫార్స్ చేస్తున్న లోక్ స‌త్తా జేపీ వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏమ‌యినా రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారేలా క‌నిపిస్తోంది.


Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the loveఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *