Main Menu

బాబుకి షాక్…వైసీపీలోకి కీల‌క నేత‌

Spread the love

చంద్ర‌బాబుకి షాక్ త‌గిలింది. అంతా స‌ర్థుమ‌ణిగింద‌నుకున్న స‌మ‌యంలో ఝ‌ల‌క్ త‌గిలింది. కీల‌క నేత ఫిరాయించేస్తున్నారు. బెజ‌వాడ‌లో మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచ‌లి ర‌వి అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ఈనెల 14న జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. జ‌గ‌న్ తో భేటీ అయిన ఆయ‌నకు గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో పార్టీ మార‌డం ఖాయం అయ్యింది.

వాస్త‌వానికి య‌ల‌మంచ‌లి ర‌వి ప‌ది రోజుల క్రిత‌మే వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. గ‌తంలో ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న ఆ త‌ర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. దాంతో ఆయ‌న చేజారిపోకుండా చూసుకోవ‌డానికి చంద్ర‌బాబు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. స్వ‌యంగా పిలిచి మాట్లాడారు. అంతా స‌ర్థుకున్న‌ట్టేన‌ని ప్ర‌క‌టించారు. య‌ల‌మంచ‌లి ర‌వి కూడా తాను పార్టీ మార‌డం లేద‌ని ప్ర‌క‌టించారు. దాంతో క‌థ ముగిసిన‌ట్టేన‌ని అంతా భావించారు. కానీ తీరా ర‌వి మ‌న‌సు మార్చుకున్నారు. పార్టీ మార‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. జ‌గ‌న్ తో భేటీ త‌ర్వాత పార్టీలో మార‌డానికి అంగీక‌రించారు.

విజ‌య‌వాడ‌లో టీడీపీకి ఇదిపెద్ద ఎదురుదెబ్బ‌గా భావిస్తున్నారు. ప్ర‌స్తుతం మారుతున్న రాజ‌కీయాల్లో ఏ ఒక్క‌రు చేజారినా ఆ త‌ర్వాత ప‌లువురు నేత‌లు పార్టీ మార‌డానికి సిద్ధ‌ప‌డ‌తార‌నే సందేహం టీడీపీ శ్రేణుల్లో ఉంది. అందుకే ర‌విని కాపాడుకోవ‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. అయినా చేజారిపోతుండ‌డంతో టీడీపీ నుంచి ప‌లువురు క్యూ క‌ట్టే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి.






Related News

ఆంధ్రాలో కేసీఆర్ ప్ర‌చారం ఆ పార్టీ కోస‌మే!

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పాత్ర‌పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. టీఆర్ఎస్ భారీ మెజార్టీకి చంద్ర‌బాబు కార‌ణ‌మంటూ సోష‌ల్Read More

చంద్ర‌బాబు క‌న్ను ఆరాష్ట్రంపై!

Spread the loveఏపీ సీఎం ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల‌లో టీడీపీ నేతృత్వంలో ఓ బృందం వెళ్లిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *