Main Menu

మోడీ-వెంక‌య్య-బాబు మ‌ధ్య‌లో కామినేనికి షాక్

Spread the love

ఏపీ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విర‌క్తి చెందారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు ఇక దూరం అంటూ ప్ర‌క‌టించేశారు. పోటీలో ఉండ‌డం లేద‌ని తేల్చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారిగా విజ‌యం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్ట‌గానే ఆయ‌న‌కు అమాత్య హోదా ద‌క్కింది. బీజేపీ కోట‌లో ఎమ్మెల్యే సీటు, మంత్రి ప‌ద‌వి ఆయ‌న‌కు ద‌క్క‌డం వెనుక వెంక‌య్య నాయుడు ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్న మాట కాద‌న‌లేని నిజం. తాజాగా త‌న రిటైర్మెంట్ విష‌యంలో కూడా వెంక‌య్య నాయుడు దారిలోనే న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఉప రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య నాయుడు క్రియాశీల రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. ఇప్పుడు ఆయ‌న అదే బాట‌లో కామినేని న‌డుస్తున్నారు.

కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కామినేని విజ‌యం సాధించారు. నాలుగేళ్ల పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. టీడీపీ, బీజేపీ మ‌ధ్య స‌ఖ్య‌త చెడిన త‌ర్వాత రాజీనామా చేశారు. అయినా టీడీపీ అదినేత చంద్ర‌బాబుతో త‌న సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు. చివ‌ర‌కు టీడీపీలో చేరి మ‌రోసారి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని భావించిన తరుణంలో కామినేని ప్ర‌క‌ట‌న అనూహ్యంగా క‌నిపిస్తోంది. కైక‌లూరులో మ‌ళ్లీ పోటీ చేయాల‌ని అంతా సిద్ధం చేసుకున్న ఆయ‌న చివ‌ర‌కు రాజ‌కీయాల్లో ఉంటాను గానీ పోటీ చేయ‌నని చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

నిజానికి వెంక‌య్య నాయుడు, చంద్ర‌బాబు మ‌ధ్య ఉన్న స‌న్నిహిత సంబంధాల కార‌ణంగా కామినేనికి లైన్ క్లియ‌ర్ కావ‌డం పెద్ద స‌మ‌స్య కాదు. అయిన‌ప్ప‌టికీ వెంక‌య్య నాయుడుకి అత్యంత స‌న్నిహితుడైన ఎమ్మెల్యే బీజేపీని వీడి టీడీపీలో చేరితే అది కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌కు ఆగ్ర‌హం క‌లిగించ‌వ‌చ్చ‌నే అంచ‌నాలున్నాయి. ఇప్పటికే మోడీ, బాబు మ‌ధ్య వైరంతో వెంక‌య్య చివ‌ర‌కు ఏపీకి కూడా చాలాదూరంగా ఉన్నారు. క‌నీసం నెల‌కు రెండు సార్లు త‌క్కువ కాకుండా ఏపీకి వ‌చ్చి పోయే ఉప రాష్ట్ర‌ప‌తి గ‌డిచిన ఆరు నెల‌ల్లో దాదాపుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి దూర‌మ‌య్యారు. బాబుతో క‌లిసి వేదిక పంచుకునేందుకు ఆయ‌న సిద్ధంగా లేర‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అలా ఎన్నాళ్లు ఉంటార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే కావ‌చ్చ గానీ మోడీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ తో జ‌త‌గ‌ట్టిన బాబు విష‌యంలో వెంక‌య్య ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో వెంక‌య్య త‌న మిత్రుడు కామినేని చేసిన సూచ‌న‌ల మేర‌కే ఇలాంటి ప్ర‌క‌ట‌న వ‌చ్చి ఉంటుంద‌ని భావిస్తున్నారు. పోటీకి దూరంగా ఉండ‌డం ద్వారా టీడీపీలో చేరిక‌కు బ్రేకులు ప‌డిన‌ప్ప‌టికీ, టీడీపీకి వ్య‌తిరేకండా నిల‌బ‌డే ప‌రిస్థితి రాకుండా చూసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. మొత్తంగా క‌ర్ర విర‌గ‌కూడ‌దు, పాము చావ‌కూడ‌ద‌న్న రీతిలో బాబు, మోడీ వైరంతో ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో చివ‌ర‌కు కామినేని అర్థాంత‌ర‌పు రిటైర్మెంట్ అనివార్యం అయిన‌ట్టు క‌నిపిస్తోంది. వెంక‌య్య కార‌ణంగా అమాత్య హోదా ద‌క్కించుకున్న కామినేని శ్రీనివాస్ చివ‌ర‌కు వెంక‌య్య‌కు స‌మ‌స్య రాకుండా చూసుకోవ‌డం కోస‌మే పోటీకి దూరంగా ఉంటున్న‌ట్టు చెప్ప‌క త‌ప్ప‌దు.


Related News

రీపోలింగ్ త‌ప్ప‌లేదు..

Spread the loveఏపీ ఎన్నిక‌ల్లో రీపోలింగ్ త‌ప్ప‌లేదు. రాష్ట్రంలోని మూడు జిల్లాల ప‌రిధిలో రీపోలింగ్ కి ఈసీ నిర్ణ‌యం తీసుకుంది.Read More

వైసీపీకి ఎదురుదెబ్బ‌!

Spread the loveగ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ట్టిగా పోరాడినా చివ‌రిలో చ‌తికిల‌ప‌డింది. ఈసారి అలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాకూడ‌ద‌ని ఆశిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *