రోజా చింతామ‌ణి లాంటిది..!

budha venkanna
Spread the love

నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో పాల‌క‌, ప్ర‌తిప‌క్షాల మాట‌ల యుద్దం ముదురుతోంది. మాట‌ల తీవ్ర‌త హ‌ద్దులు దాటుతోంది. ఇటీవ‌ల జ‌గ‌న్ వ్యాఖ్య‌ల మీద దుమ్మెత్తిపోసిన టీడీపీ నేత‌లు కూడా నోటికి ప‌నిచెబుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న హ‌ద్దులు లేవ‌న్న‌ట్టుగా వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా మీద మాట‌ల దాడి చేశారు. ఆమెను ఏకంగా చింతామ‌ణితో పోల్చారు. ప్రతిపక్ష పార్టీ ఓ డ్రామా కంపెనీలా మారిందని విరుచుకుపడ్డారు. వైసీపీ డ్రామా కంపెనీలో రోజాది చింతామణి క్యారెక్టర్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఖిలప్రియ డ్రెస్ గురించి రోజా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సభల్లో పాల్గొనేటప్పుడు రోజాకు ఆల్కహాల్ టెస్ట్ జరిపించాలని వ్యాఖ్యానించారు. మద్రాసులో చెల్లని చెక్కుల కేసుల్లో రోజా ఎన్నోసార్లు కోర్టు మెట్లు ఎక్కారన్నారు. అలాంటి వ్యక్తికి టీడీపీ నేతలను విమర్శించే స్థాయి లేదన్నారు. చంద్రబాబుపై జగన్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా టీడీపీకి లక్ష మెజార్టీ పెరిగినట్లేనన్నారు.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *