Main Menu

బోండా ఉమా భార్యను ఇరికించారా?

Spread the love

బెజవాడ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. అందులోనూ బోండా ఉమా తీరు అయితే సంచనలమే. సాధారణ వ్యక్తిగా రాజకీయాలలో ప్రవేశించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పలు దందాలత ద్వారా బాగా సంపాదించుకున్నారన్నది ఉమా మీద ఆరోపణ. నగరంలో పలు అవినీతి, అక్రమాలకు ఆయన కేరాఫ్ గా మారారని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఉమా తీరు కూడా ఉంటుంది. కొద్ది నెలల క్రితం ఓ కుటుంబం రోడ్డున పడిన నేపథ్యంలో ఉమా పాత్ర మీద రాష్ట్రమంతా మీడియాలో వచ్చిన కథనాలు కలకలం రేపాయి.

కాగా మాజీ సైనికుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో బోండా ఉమా భార్య సుజాత మీద కూడా కేసు నమోదయ్యే పరిస్థితి రావడం విశేషంగా మారుతోంది. భూదందాల వెనుక ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందనే వాదనకు ఈ కేసు తోడ్పడింది. సీఐడీ అధికారుల ముందు అఫ్రూవర్ గా మారిన కోటేశ్వరరావు తన పేరు మీదుగా రెండున్నర ఎకరాలను దౌర్జన్యంగా తప్పుడు పాత్రలతో రాయించారంటూ జడ్జి ముందు వాంగ్మూలం ఇవ్వడంతో కార్పోరేటర్ గుండారపు మహేష్ తో పాటు ఎమ్మెల్యే భార్య మీద కేసు సిద్ధం అయ్యింది. ఇది రాజకీయంగా బోండా ఉమాకు పెను నష్టం కలిగించే అంశంగా భావిస్తున్నారు.

అయితే బోండా ఉమా మీద అంతకు మించిన సమస్యలు వచ్చినప్పుడు కూడా కాపాడిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఏకంగా ఆయన భార్య మీద కూడా కేసు నమోదుకి ఎందుకు అంగీకరించినట్టన్నది ఆసక్తిగా కనిపిస్తోంది. రాజకీయంగా మారుతున్న పరిణామాలతో కేసుల ద్వారా బోండా ఉమాని కట్టడి చేసే యత్నం సాగుతోందనే ప్రచారం మొదలయ్యింది. కొద్దిరోజుల క్రితం మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కమ్మ, కాపు విబేధాలను తెరమీదకు తీసుకురావడానికి ఉమా ప్రయత్నించారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఆయన అలకపూనడం కలకలం రేపింది. ఆ తర్వాత కూడా ఉమా కొత్తదారి వెదుక్కుంటున్నారనే ప్రచారం ఆగలేదు. ఈ నేపథ్యంలోనే బోండా ఉమా ని నియంత్రించాలనే లక్ష్యంతో ఈ కేసును ముందుకు తెచ్చారని భావిస్తున్నారు. 2017లో ఫిర్యాదు చేస్తే ఆలశ్యంగా ఈ వ్యవహారం తెరమీదకు వచ్చిన నేపథ్యం దానికి తగ్గట్టుగా ఉందనే వారు కూడా ఉన్నారు. దాంతో బెజవాడ టీడీపీ వ్యవహారాలు బోండా భూ భాగోతంతో మరింత వేడెక్కే అవకాశం ఉంది.


Related News

అమరావతిలో మళ్లీ లీకులు

Spread the love ఏపీ రాజధాని అమరావతిలో లీకుల పర్వం సాగుతోంది. గతంలో ప్రతిపక్ష నేత ఛాంబర్ లో లీకులొచ్చాయి.Read More

జోరు పెంచిన టీడీపీ!

Spread the loveటీడీపీ వ్యూహం మార్చింది. రాజ‌కీయంగా మ‌నుగ‌డ సాగించాలంటే మీడియాలో కొత్త పంథా అవ‌స‌రం అని గ్ర‌హించింది. దానికిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *