బోండా ఉమా గుండు గీయించుకుంటారు

bonda uma
Spread the love

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ఆయన వ్యవహార శైలి మీద చివరకు సీఎం కూడా ఓమారు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా బోండా ఉమాని పిలిచి ఆయన చిట్టా విప్పుతామంటూ బెదిరించారని పలువురు వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలపై బోండా వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఓవైపు టీడీపీ నేతలంతా ఈ ఎన్నికల ఫలితాలు రెఫరెండం కాదని చెబుతుంటే బోండా ఉమా మాత్రం తాను మాత్రం దానికి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ ఓడిపోతే తాను గుండు గీయించుకుంటానని సవాల్ చేశారు.

నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీదే విజయమని జోస్యం చెప్పారు. టీడీపీ చేసిన సంక్షేమ కార్యక్రమాలే పార్టీని విజయం దిశగా నడిపిస్తాయని ఆయన చెప్పారు. నంద్యాలలో ఓటమిపాలైతే తాను గుండుకి సిద్ధమని, వైఎస్సార్సీపీ ఓటమిపాలైతే గుండు గీసుకునేందుకు మీరు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ నేతలెవరైనా తన సవాల్ స్వీకరించగలరా? అని ఆయన ప్రశ్నించారు. దాంతో ఇప్పుడు నంద్యాల ఉపఎన్నికల వేడి విజయవాడలో బోండా గుండు వరకూ వచ్చినట్టు కనిపిస్తోంది.






Related News

DO6VyfFVoAMHVAK

సోషల్ మీడియాపై చంద్రబాబు కన్ను…

Spread the loveఇప్పటికే రాజకీయ పార్టీలు సోషల్ మీడియాకు ప్రాధాన్యత పెంచుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా తన విధానాలRead More

Chintamaneni

సిగ్గుపడాల్సిందేగా…?

Spread the loveఏపీ రాజధాని ప్రాంతంలో తన గేదెలు మేపుకోవడానికి మంచి అవకాశం దొరికిందంటున్నారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. విచిత్రRead More

  • బెజవాడ వైసీపీలో హీటు రాజేసిన పాదయాత్ర
  • చంద్రబాబుని నిలదీసిన సినీ దర్శకుడు
  • నిర్లక్షానికి పరిహారం పర్యాటకుల ప్రాణాలు
  • వైసీపీ అధినేతపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
  • వారికి తలుపులు మూసేసిన జనసేన
  • డిజైన్లు ఖరారు: 26న శంకుస్థాపన
  • మళ్లీ నోట్ల రద్దు చేయాలన్న చంద్రబాబు
  • జగన్ తొలి అడుగు పడింది..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *