Main Menu

వైసీపీని స‌మర్థించిన బీజేపీ నేత‌

Spread the love

ఏపీ అసెంబ్లీలో బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మార‌తోంది. ఆయ‌న ఇప్పటికే వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్ర‌చారం ఉంది. దానికి త‌గ్గ‌ట్టుగానే తాజాగా ఆయ‌న కామెంట్స్ ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ, సెక్ర‌టేరియేట్ లో వ‌ర్షం కురిసి, క‌ట్ట‌డాలు నీరుగారిపోతున్నాయంటూ బీజేపీ నేత‌లు విన్నూత్న ఆందోళ‌న చేశారు. గొడుగులు, రెయిన్ కోట్లు వేసుకుని ఆందోళ‌న చేశారు. అసెంబ్లీ ప్రారంభోత్సం సంద‌ర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర‌స‌న తెల‌ప‌డం విశేషంగా మారింది.

ఈ సంద‌ర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వ తీరుని, స్పీక‌ర్ కోడెల వ్య‌వ‌హార‌శైలిని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం లేకుండా స‌భ జ‌ర‌గ‌డం స‌రికాద‌న్నారు. వైసీపీ దూరంగా ఉండ‌డానికి పాల‌క‌ప‌క్ష‌మే కార‌ణ‌మ‌న్నారు. పార్టీ ఫిరాయించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ఎందుకు ఆల‌శ్యం చేస్తున్నార‌ని నిల‌దీశారు. ఇలాంటి ధోర‌ణి స‌రికాద‌న్నారు. ఎంత కాలం స‌మ‌యం తీసుకుంటారు పార్టీ ఫిరాయింపుల‌పై చ‌ర్య‌ల‌కు అంటూ స్పీక‌ర్ ని ప్ర‌శ్నించారు అంతేగాకుండా ఈ విష‌యంలో వైసీపీ తీరుని తాను స‌మ‌ర్థిస్తున్నానంటూ బీజేపీ ఫ్లోర్ లీడ‌ర్ కామెంట్ చేయ‌డం విశేషం.






Related News

ఆర్కే ప్ర‌త్య‌ర్థి అత‌డే..!

Spread the loveవ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అన్ని పార్టీలు కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నారు. వ‌చ్చే మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఈసీRead More

జ‌న‌సేనాని..ఓ సారి వెన‌క్కి చూసుకో..!

Spread the loveరాజ‌కీయ మార్పు కోసం అంటూ ముంద‌డుగు వేసిన జ‌న‌సేనానికి అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఏపీలో స‌మీక‌ర‌ణ కోసం ఏరీతినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *