Main Menu

చంద్ర‌బాబుని అవ‌మానిస్తున్న హ‌స్తిన‌!

Spread the love

ఏపీ వ్య‌వ‌హారాల విష‌యంలో చంద్ర‌బాబుని ఖాత‌రు చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. కేంద్రంలోని క‌మ‌ల‌నాథులు టీడీపీ ప్ర‌తిపాద‌న‌ల‌ను అస‌లు ప‌రిగ‌ణిస్తున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. తాజాగా చ‌ర్చ‌ల పేరుతో సాగించిన వ్య‌వ‌హారం కూడా కొలిక్కి రాలేదు. పైగా ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించి ఎటువంటి తాయిలాలు లేక‌పోవ‌డంతో తెలుగుదేశం బృందం మొఖం తేలేయాల్సి వ‌చ్చింది. అందుకు తోడు కీల‌కాంశాల ప్ర‌స్తావ‌న రాగానే త‌ర్వాత మాట్లాడ‌దాం అంటూ మంత్రి అరుణ్ జైట్లీ మ‌రోసారి దాట‌వేత ధోర‌ణి అవ‌లంభించ‌డం మింగుడుప‌డ‌డం లేదు. దాంతో బీజేపీ విష‌యంలో తామెంత సామ‌ర‌స్యంగా ఉన్న‌ప్ప‌టికీ కాషాయ శ్రేణులు క‌నిక‌రించే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు.

ఇప్ప‌టికే హ‌స్తిన‌లో విప‌క్షాల ఐక్య‌త మొద‌ల‌య్యింది. వైసీపీ ధ‌ర్నాకి లెఫ్ట్ తో పాటు చ‌ల‌సాని శ్రీనివాస్, క‌త్తి మ‌హేష్ స‌హా కొంద‌రు వ్య‌క్తులు కూడా సంఘీభావం ప్ర‌క‌టించారు. త‌ద్వారా హోదా ఉద్య‌మం ఉధృత‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఏపీ ప్ర‌జ‌ల్లో దాని ప్ర‌భావం విస్త‌రిస్తోంది. దానిక‌నుగుణంగానే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా దాదాపు మాట మార్చేసింద‌నే చెప్ప‌వ‌చ్చు. 2017 బ‌డ్జెట్ స‌మావేశాల గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో ప్యాకేజీ ప‌ర‌మ ఔష‌ధంగా ప్ర‌క‌టించి, తాజా బ‌డ్జెట్ ప్ర‌సంగంలో మాత్రం దానికి భిన్నంగా హోదా ఇవ్వాల్సిందేన‌ని నిన‌దించ‌డం గ‌మ‌నిస్తే అర్థ‌మ‌వుతుంది. అయితే ఇలా త‌మ మిత్ర‌ప‌క్షం మాట మార్చ‌డ‌మే బీజేపీకి అలుసుగా మారింద‌నే వారు కూడా లేక‌పోలేదు. ఏడాది క్రితం ఒక మాట‌, ఇప్పుడు మ‌రోమాట మారుస్తూ త‌మ‌న ఇర‌కాటంలో పెట్టేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఢిల్లీ క‌మ‌ల‌నాధులు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దాంతో ఏపీ విష‌యంలో నిక‌రంగా నిల‌బ‌డాల‌ని బీజేపీ నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

దానికి తోడు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు స‌హా అనేక అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న బీజేపీ తీరు టీడీపీకి త‌ల‌నొప్పులు పెంచ‌డ‌మే త‌ప్ప త‌గ్గించేలా క‌నిపించడం లేదు. ఇది ఏపీలో చంద్ర‌బాబుకి జీర్ణించుకోలేని విష‌యం అవుతోంది. ప్ర‌స్తుతానికి బీజేపీ విష‌యంలో ఎటూ తేల్చుకోలేని అంశంగా మారిపోయింది. దాంతో రెండ‌డుగులు ముందుకు, మూడ‌డుగులు వెన‌క్కి అన్న చందంగా టీడీపీ అధినేత వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజా అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా బీజేపీ నేత‌లు స్వ‌రం పెంచి ఎదురుదాడి చేస్తున్నా లాబీల్లో టీడీపీ నేత‌లు కొంత సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించ‌డం విశేషంగా మారింది. ఇది వ‌ర్త‌మాన ఏపీ రాజ‌కీయాల‌కు అనుగుణంగా సాగుతున్న తంతుగా ప‌లువురు భావిస్తున్నారు. ఏమ‌యినా తెలుగుదేశం అధినేత త‌న ప‌రిస్థితిని స‌మీక్షించుకుంటూ స‌రిపుచ్చుకుంటే చివ‌రిలో చేతులు కాలిన త‌ర్వాత ఆకులు పట్టుకున్నా పెద్ద ఉప‌యోగం ఉండ‌ద‌న్న‌ది గ్ర‌హిస్తే మంచిదేమో!


Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the loveఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *