Main Menu

ఏపీ అసెంబ్లీకి ఎమ్మెల్యే రాజీనామా

Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఓవైపు ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు మాట‌ల దాడి పెంచుతున్నారు. నేరుగా చంద్ర‌బాబు కూడా పీఎం రాక‌ను నిర‌సిస్తూ ఆందోళ‌న‌లో పాల్గొంటార‌నే ప్ర‌చారం ఆస‌క్తిగా మారింది. ఈ త‌రుణంలోనే మాజీమంత్రి పైడి కొండల మాణిక్యాలరావు రాజీనామా సంచ‌ల‌నంగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వ తీరుకు నిరసనగానే రాజీనామా చేసినట్టు ఆయ‌న వెల్లడించారు.

ప్రజలకిచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నియోజకవర్గానికి ఇచ్చిన సుమారు 56 హామీలు నెరవేర్చనందుకే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. 15 రోజుల్లోగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని అల్టిమేటం జారీ చేశారు. మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాడేపల్లిగూడెం నియోజవర్గానికి చెందిన పలు సమస్యల పరిష్కారానికై 3 నెలలుగా చంద్రబాబు చుట్టూ తిరుగతున్నా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. 15 రోజుల్లోగా స్పందించ‌క‌పోతే తాను ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు పూనుకుంటానంటూ మాణిక్యాల‌రావు చేసిన హెచ్చ‌రిక‌లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. మాజీ మంత్రి రాజీనామాతో తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి.






Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the loveఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *