రివ‌ర్స్ ఎటాక్ ప్రారంభించిన క‌మ‌ల‌నాధులు

bjp-tdp
Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు త‌ప్పేలా లేవు. ఇప్ప‌టికే బీజేపీ రాజీనామాలు సంధించింది. సీఎం కూడా ఆమోదించారు. దాంతో పైడికొండ‌ల మాణిక్యాల‌రావు, కామినేని శ్రీనివాస్ అప్పుడే మాజీల‌యిపోయారు. అయితే క‌మ‌ల‌ద‌ళం మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. త‌మ‌ను బ్లాక్ మెయిల్ చేయ‌డానికి బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని భావిస్తోంది. దాంతో రివ‌ర్స్ ఎటాక్ కి స‌న్నాహాలు చేస్తోంది. తామేమీ త‌క్కువ తిన‌లేద‌ని నిరూపించుకోవాల‌ని చూస్తోంది. అందులో భాగంగా ఏపీలోని వివిధ ప‌థ‌కాల ప‌రిస్థితిపై ఆరా తీస్తోంది. క్షేత్ర‌స్థాయిలో అడుగులు వేస్తోంది. తాజాగా మంగ‌ళ‌గిరిలోని ఎయిమ్స్ లో అడుగు పెట్టింది. మాణిక్యాల‌రావు, కామినేని తో పాటు ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధ‌వ్ కూడా ఎయిమ్స్ ని ప‌రిశీలించారు. పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అధికారుల‌తో మాట్లాడారు. నిధుల‌పై ఆరా తీశారు. కేంద్రం ఎంత ఇచ్చింది, ఏం చేశారు అంటూ లెక్క‌లు అడిగి తెలుసుకున్నారు.

త‌ద్వారా టీడీపీని ఇర‌కాటంలో నెట్ట‌డానికి తాము సన్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు సంకేతాలిచ్చేశారు. వివిధ ప‌థ‌కాల విష‌యంలో ప్ర‌భుత్వ నిధుల వినియోగం విష‌యంలో చంద్ర‌బాబు స‌క్ర‌మంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నే విష‌యాన్ని నిరూపించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఎయిమ్స్ ని సంద‌ర్శించిన‌ట్టు క‌నిపిస్తోంది. మిగిలిన విష‌యాల్లో కూడా అదే చొర‌వ తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అది చంద్ర‌బాబుని కార్న‌ర్ చేయ‌డానికి తోడ్ప‌డుతుంద‌నే అభిప్రాయం క‌మ‌లం పార్టీ శ్రేణుల్లో క‌నిపిస్తోంది. త‌ద్వారా తెలుగుదేశాన్ని క‌ట్టడి చేయ‌వ‌చ్చ‌ని నేత‌లు భావిస్తున్ఆన‌రు.

ఈ నేప‌థ్యంలో తాజా ప‌రిణామాలు టీడీపీ, బీజేపీ మ‌ధ్య మ‌రింత దూరం పెంచ‌డానికి దోహ‌ద‌ప‌డుతోంద‌ని చెబుతున్నారు. త‌ద్వారా ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వేడి రాజుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే బీజేపీ కేవ‌లం బాబుని దారికి తెచ్చుకోవ‌డానికి మాత్ర‌మే ఇలాంటి ఎత్తులు వేస్తుందా లేక నిజంగా నిధుల వినియోగం విష‌యంలో స‌ర్కారు తీరును బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుందా అన్న‌ది చూడాల్సి ఉంది.


Related News

Its-Not-Jana-Sena--Kapu-Sena--Kathi-Mahesh-1512798570-1316

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి దొరికిన క‌త్తి మ‌హేష్

Spread the loveఫిల్మ్ క్రిటిక్ గా కెరీర్ ప్రారంభించి కొంత కాలంగా పొలిటిక‌ల్ ఎనాలిసిస్ కి సిద్ధ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా అవ‌కాశంRead More

pawantt_4127

త‌న అభిప్రాయంతో జ‌నం ఏకీభ‌వించ‌డంలేదంటున్న ప‌వ‌న్

Spread the loveజ‌న‌సేన అధినేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అభిప్రాయానికి,Read More

 • కాబోయే మంత్రి ఎవ‌రు..?
 • మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!
 • కామినేనిపై క‌త్తిలాంటి సెటైర్
 • ఏపీ స‌మ‌స్య‌ల‌న్నింటికీ జ‌గ‌నే కార‌ణం….
 • రివ‌ర్స్ ఎటాక్ ప్రారంభించిన క‌మ‌ల‌నాధులు
 • టీడీపీ రాజీనామాల నిర్ణ‌యం:దూరంగా ఉన్న‌మంత్రి
 • ఏపీకి టోపీ పెట్టేశారు…
 • చంద్ర‌బాబుని అవ‌మానిస్తున్న హ‌స్తిన‌!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *