బాబు ముందుకు బెజవాడ పంచాయితీ

indrakeeladri kanakadurgamma
Spread the love

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ అంతరాలయ దర్శనం టికెట్‌ ధర పంచాయతీ సీఎం దగ్గరికి చేరింది. దుర్గమ్మ దర్శనం టికెట్ల వివాదాన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది.

విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ అంతరాలయం దర్శనం టికెట్‌ ధర వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. ఈ పంచాయతీ అటూ ఇటూ తిరిగి చివరికి సీఎం చంద్రబాబు దగ్గరికి చేరింది. దర్శనం టికెట్ల లొల్లికి పుల్‌స్టాప్‌ పెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆరుగురు సభ్యులతో తాత్కాలికంగా ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతరత్రా కార్యక్రమాలపై ఈ కమిటీ రిపోర్ట్ తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది.

దర్శనం టికెట్ల ధరను పాలక మండలి 300 రూపాయలు చేసింది. ఇది భక్తులకు భారంగా మారింది. దర్శనం టికెట్ల ధరను తగ్గించాలని భక్తులు కోరారు. 300 నుంచి 150 రూపాయలకు తగ్గించాలని ఆలయ అధికారులకు, ఈవో దృష్టికి భక్తజనం తీసుకెళ్లారు. ఈవో సూర్యకుమారిపై తగ్గే ప్రసక్తేలేదని తేల్చిచెప్పడంతో వివాదం మొదలైంది. దర్శనం టికెట్‌ ధర భారమవ్వడంతో భక్తుల సంఖ్య కూడా తగ్గింది. దీంతో ఇంద్రకీలాద్రికి ఆదాయంకూడా తగ్గింది. దర్శనం టికెట్ల ధరలను తగ్గించాలని సాక్షాత్తు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విన్నపాన్ని ఈవో బేఖాతరు చేశారు. ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని చెప్పడం పాలక పెద్దలను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా దుర్గగుడిలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. ఈవోకు వ్యతిరేకంగా నివేదికలు వెళ్లడంతో ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేదిలేదని, ఈవో, ఆలయ సిబ్బంది, ఉన్నతాధికారులు, పాలక మండలి కలిసికట్టుగా సమన్వయంతో ముందుకెళ్లాలని.. అమ్మవారి చెంత రాజకీయాలుచేస్తే చర్యలు తప్పవంటూ తనదైన శైలిలో మందలించారు. వెంటనే దుర్గగుడిలో నెలకొన్ని వివాదాలపై నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

సెప్టెంబర్‌ 21 నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై జరుగనున్నాయి. నవ్యాంధ్రలో దసరాను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించినా నిధులను విడుదల చేయలేదు. దీంతో దుర్గమ్మ ఆలయ నిధులు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చవుతున్నాయి. ఈ ఏడాది 10కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని పాలక మండలి ప్రభుత్వాన్ని కోరుతుంది.


Related News

BJP-AP

గొంతునొక్కేస్తున్న బీజేపీ నేత‌లు

Spread the loveఏపీ బీజేపీలో ప‌రిణామాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. పార్టీ ఆంత‌రంగిక వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. తాజాగా బీజేపీ ప‌దాదికారులRead More

varadapuram suri

ఎమ్మెల్యే ఇంటి ముందు హార్న్ కొట్టార‌ని త‌ల ప‌గుల‌గొట్టారు…

Spread the loveఅనంత‌పురం జిల్లాలో ఎమ్మెల్యే వ‌ర్గీయులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి అనుచ‌రులు ముగ్గురు యువ‌కుల‌పై దాడి చేశారు.Read More

 • వైసీపీకి చెక్ పెట్టడానికి సీబీఎన్ స్కెచ్!
 • మోడీ, బాబు మధ్యలో అంబానీ
 • ఆత్మహత్యాయత్నం వెనుక రాయపాటి కొడుకు
 • చంద్రబాబుపై బీజేపీ నిప్పులు
 • జెండాపీకేసిన జనసేన
 • అమెరికాలోనూ టీడీపీదే అధికారం
 • మరో వైసీపీ వికెట్ డౌన్
 • బోండా ఉమా భార్యను ఇరికించారా?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *