వారి నోరు కొట్టేసిన ఆర్కే..!

MLA Alla Ramakrishna Reddy (2)
Spread the love

అవును..ఇదే చ‌ర్చ సాగుతోంది. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి తీరు ఆస‌క్తిగా మారుతోంది. ఆయ‌న ఓ వైపు అన్నార్తుల ఆక‌లి తీర్చ‌డానికి చౌక‌గా క్యాంటీన్లు నిర్వ‌హిస్తున్నారు. చివ‌ర‌కు ఆయ‌న సొంత త‌ల్లి కూడా కొడుకు ప్ర‌య‌త్నాన్ని అభినందించింది. ప‌లువురి క‌డుపు నింప‌డాన్ని చూసి ఆశీర్వ‌దించింది. కానీ అదే ఆర్కే న్యాయ‌స్థానంలో చేసిన పోరాటం కొంద‌రు నోళ్లు కొట్టేసిన‌ట్ట‌య్యింద‌నే ప్ర‌చారం సాగుతోంది. అది కూడా నిజ‌మే అనిపిస్తోంది. ఎందుకంటే కోట్ల ఖ‌రీదైన స‌దావ‌ర్తి భూముల వ్య‌వ‌హారంలో ఆయ‌న చేసిన న్యాయ‌పోరాటం ఫ‌లించింది. ఆ భూములు త‌న‌కు కావాల‌ని కాకుండా ఖ‌రీదైన స‌ర్కారు స్థలాల‌ను కొంద‌రు కారుచౌక‌గా కొట్టేస్తున్నార‌ని ఆయ‌న హైకోర్ట్ లో పిటీష‌న్ వేసి ప్ర‌భుత్వాన్ని కోర్టు బోనులో నిల‌బెట్టారు. చివ‌ర‌కు అనూహ్యంగా కోర్టు ఇచ్చిన తీర్పు ప్ర‌కారం 5 కోట్లు అద‌నంగా చెల్లించి స‌ద‌రు స‌దావ‌ర్తి భూముల‌ను సొంతం చేసుకోవ‌డానికి కూడా ఆయ‌న వెన‌కాడ‌లేదు. అంత పెద్ద మొత్తం చెల్లిస్తే ఐటీ రెయిడ్స్ త‌ప్ప‌వ‌ని ప్ర‌భుత్వంలో కీల‌క మంత్రి హెచ్చ‌రించినా వెనుకాడ‌లేదు. రెండు విడత‌ల్లో 27.5 కోట్ల సొమ్ము చెల్లించి కోర్టులో స‌దావ‌ర్తి భూములు సొంతం చేసుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యారు.

కానీ కోర్ట్ అనూహ్యంగా మ‌రోసారి వేలం వేయ‌డానికి, అందులో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి పాల్గొనే అవ‌కాశం ఇవ్వాల‌ని కూడా ఆదేశాలు రావ‌డంతో అనివార్యంగా 27.5 కోట్ల‌కు పైగానే స‌దావ‌ర్తి భూముల వేలం క‌నిపిస్తోంది. దాంతో ప్ర‌భుత్వం గ‌తంలో 22.5 కోట్ల‌కే క‌ట్ట‌బెట్టిన నేప‌థ్యంలో భారీగా చేతులు మారిన‌ట్టు ప్ర‌చారం సాగిన నేప‌థ్యంలో ఇప్పుడు వారంద‌రికీ ఇబ్బందిక‌రంగా మారింది, వాస్త‌వానికి ఈ స‌దావ‌ర్తి భూములు కాజేశారంటూ కాపు కార్పోరేష‌న్ చైర్మ‌న్ రామానుజ పేరు ప్ర‌ధానంగా వినిపించింది. నారా లోకేష్ త‌న బినామీల పేరుతో స‌దావ‌ర్తి భూముల‌ను కారుచౌక‌గా కొల్ల‌గొట్టారని విమ‌ర్శ‌లు వినిపించాయి. ఇప్పుడు అలాంటి నేత‌లంతా భారీగా ప్ర‌యోజ‌నాలు ఆశించిన‌ప్ప‌టికీ ఆర్కే న్యాయ‌పోరాటంతో వారి ఆశ‌ల‌కు గండిప‌డింది.

పైగా వెంట‌నే వేలం నిర్వ‌హించాల‌ని కోర్ట్ ఆదేశించ‌డంతో ఈసారి వేలం ప్ర‌క్రియ‌లో ఆర్కే కూడా పాల్గొంటార‌నడంలో సందేహం లేదు. ఇంత న్యాయ‌పోరాటం చేసిన త‌ర్వాత ఆయ‌న వేలానికి రాక‌పోతే ఆయ‌న పోరాటాన్ని నీరుగార్చిన‌ట్ట‌వుతుంది. అందుకే ఆయ‌న ముందుకొస్తారు. కాబ‌ట్టి స‌దావ‌ర్తి భూములు కొత్త వేలంలో మ‌రికొంత పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కాబ‌ట్టి 22.5 కోట్ల‌కే స‌దావ‌ర్తి భూములు కాజేయ‌డం ద్వారా భారీగా కొల్ల‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నించిన వారి ఆశ‌ల‌కు ఆయ‌న గండికొట్టేసిన‌ట్టే అయ్యింది. మ‌రో ఆస‌క్తిక‌ర అంశం ఏందంటే స‌దావ‌ర్తి భూముల పేరుతో భారీగా చేతులు మారిన కోట్ల రూపాయ‌ల వ్య‌వ‌హారం గురించి ప‌లువురి మ‌ధ్య త‌గాదా కూడా మొద‌ల‌య్యింద‌నే ప్ర‌చారం పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో కొన‌సాగుతుండ‌డం విశేషం.


Related News

vijayawada

రెచ్చిపోయిన తెలుగుతమ్ముళ్లు

Spread the loveబెజవాడ తమ్ముళ్లు రెచ్చిపోయారు. పోలీసుల అండతో అధికార పార్టీ కావడంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రత్నాకర్ అనేRead More

bonda uma

బోండా ఉమా గుండు గీయించుకుంటారు

Spread the loveవిజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ఆయన వ్యవహార శైలి మీదRead More

 • కొడాలి నాని మోజు పడ్డారు
 • రెచ్చిపోయిన రోజా
 • మీదే కులమో చెప్పాలంటున్న ప్రభుత్వం!
 • మ‌ళ్లీ మెలిక‌: కాపు రిపోర్ట్ రాగానే కేంద్రానికి..!
 • రాయపాటి ఆశల‌కు జగన్ ఆఫర్…!
 • బాబుపై దండ‌యాత్ర‌కు మ‌రో నేత‌
 • టీడీపీకి కొత్త తలనొప్పి, నేతల రాజీనామా
 • టీడీపీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *