Main Menu

బీజేపీ కి మిగిలేది ఒక్క‌రే..!

Spread the love

బీజేపీకి ఏపీలో గ‌డ్డు ప‌రిస్థితి త‌ప్పేలా మ‌రింత‌.మ‌రింత ద‌య‌నీయంగా ఆపార్టీ ప‌రిస్థితి మారిపోయే ప్ర‌మాదం దాపురిస్తోంది. ఇప్ప‌టికే బీజేపీలో చేరిన ఇత‌ర పార్టీల నేత‌లు సొంత గూటివైపు మ‌ళ్లేలా క‌నిపిస్తున్నారు. చివ‌ర‌కు పార్టీ మారాల‌ని నిర్ణ‌యించుకుని ఫ్లెక్సీలు కూడా వేయించుకున్న త‌ర్వాత వెన‌క్కి వ‌చ్చిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ నే అధ్య‌క్షుడిగా నియ‌మించుకున్న ఆపార్టీ ప‌రిస్థితి ఏరీతిలో ఉంటుందో ఊహించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

ఇక ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జంపింగ్ కి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ఇత‌ర పార్టీల్లో ఖ‌ర్చీఫ్ లు వేసుకుని కూర్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందులో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఆయ‌న తెలుగుదేశం పార్టీతో చాలాకాలంగా స‌న్నిహితంగా మెలుగుతున్నారు. ఆపార్టీ నాయ‌కుడిగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారని చివ‌ర‌కు బీజేపీ శ్రేణుల్లోనే చ‌ర్చ జ‌రిగిన సంద‌ర్భాలున్నాయి. ఈనేప‌థ్యంలో కొద్ది నెల‌ల క్రితం అనివార్యంగా మంత్రి ప‌ద‌వి వ‌దులుకోవాల్సి వ‌చ్చిన‌ప్ప‌టికీ కామినేని, చంద్ర‌బాబు మ‌ధ్య సంబంధాల‌కు పెద్ద స‌మ‌స్య‌లు రాలేదు. ఇటీవ‌ల బీజేపీ నేత‌లంతా టీడీపీ మీద దుమ్మెత్తిపోస్తుంటే కామినేని మాత్రం ప‌ల్లెత్తుమాట అన‌క‌పోవ‌డం గ‌మ‌నిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కైక‌లూరు నుంచి సైకిల్ గుర్తుపై కామినేని పోటీ చేయ‌డం ఖాయం అని చెప్ప‌వ‌చ్చు. తాజాగా క‌ల‌ప‌ర్రులో జ‌రిగిన చంద్ర‌బాబు స‌భ‌లో కూడా కామినేని కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.టీడీపీ నేత‌లంద‌రితో క‌లిసి పోయి స‌ఖ్యంగా సాగారు.

ఇక రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌న్నారాయ‌ణ కూడా ఫిరాయింపు ఖాయం చేసుకున్నారు. ఆయ‌న జ‌న‌సేన‌లోటికెట్ ఆశిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ సీటుకి పోటీ చేయాల‌ని ఆశిస్తున్నారు. ఇప్ప‌టికే స‌త్య‌న్నారాయ‌ణ భార్య జ‌న‌సేన‌లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దాంతో బీజేపీ ఎమ్మెల్యే కూడా త్వ‌ర‌లోనే కండువా మార్చేయ‌డం దాదాపు అనివార్యంగా క‌నిపిస్తోంది. ఇక విశాఖ ఎమ్మెల్యే, బీజేపీ ఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు కూడా పార్టీ మారిపోవ‌డం గ్యారంటీ అని ఆయ‌న అనుచ‌రులే చెబుతున్నారు. అయితే ఏపార్టీలోకి వెళ‌తార‌న్న విష‌యంలో క్లారిటీ రావ‌డం లేద‌ని స‌మాచారం. విష్ణు కుమార్ రాజు వైసీపీ శిబిరంతో ట‌చ్ లో ఉన్నారు. టీడీపీ నేత‌ల‌తో కూడా మంచి సంబంధాలు నెరుపుతున్నారు. దాంతో ఆయ‌న్ని ఇరు పార్టీల నేత‌లు పెద్ద‌గా విశ్వ‌సించ‌డం లేద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోది. అయితే గంటా శ్రీనివాస‌రావు విష‌యంలో స్ప‌ష్ట‌త రాగానే విష్ణుకుమార్ రాజు వ్య‌వ‌హారం తేలిపోతుంద‌ని అంతా భావిస్తున్నారు.

ఇక బీజేపీలో మిగిలే సిట్టింగ్ ఎమ్మెల్యేఒకే ఒక్క‌డుగా తాడేప‌ల్లిగూడెం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పైడికొండ‌ల మాణిక్యాల‌రావు మిగిల‌పోతున్నారు. ఆయ‌న సుదీర్ఘ‌కాలంగా ఆర్ఎస్ఎస్ కి చెందిన కార్య‌క‌ర్త‌గా ఉన్నందున కాషాయ జెండా వీడే అవ‌కాశాలు లేవు. దాంతో బీజేపీ నేత‌లు ముగ్గురు మూడు పార్టీల వైపు చూస్తుండ‌గా ఆపార్టీకి మిగిలేది ఏకైక నాయ‌కుడు మాత్ర‌మే కావ‌డం విశేషం.


Related News

ఏపీలో ఒంట‌రి జ‌గ‌న్!

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో వైఎస్ జ‌గ‌న్ ఒంట‌రి అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఏకాకిగా మిగిలిన బీజేపీకి ఆయ‌న మాత్ర‌మేRead More

మైల‌వ‌రంలో ప‌రువు పోయింది..!

Spread the loveకృష్ణా జిల్లాలో కీల‌క‌మైన మైల‌వ‌రం ప‌రిణామాలు ఇప్పుడు ఆస‌క్తిగా మారుతున్నాయి. తాజాగా వ‌సంత‌కృష్ణ ప్ర‌సాద్ మీద పెట్టినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *